Naked Worship In Guntur: గుప్త నిధులతో ఎర.. నగ్నంగా పూజల్లో కూర్చుంటే లక్ష రూపాయలు ఇస్తామని ఆఫర్.. యువతులతో నగ్న పూజలు.. అనంతరం లైంగిక దాడికి యత్నం.. పూజారి సహా 12 మంది అరెస్ట్.. గుంటూరులో గగుర్పాటుకు గురిచేసే ఘటన

వివరాల్లోకి వెళ్తే, తాటికొండ మండలం పొన్నేకల్లుకు చెందిన పూజారి నాగేశ్వరరావు తరుచూ పూజలు చేస్తూ ఉంటాడు.

Guntur, May 15: వ్యాపారంలో నష్టపోయిన మహిళకు సులభంగా డబ్బు (Easy Money) సంపాదించేందుకు సాయపడుతామని, దానికోసం యువతులతో నగ్నంగా క్షుద్రపూజలు (Naked Worship) చేయించిన ఘటన గుంటూరులో (Guntur) జరిగింది. వివరాల్లోకి వెళ్తే, తాటికొండ మండలం పొన్నేకల్లుకు చెందిన పూజారి నాగేశ్వరరావు తరుచూ పూజలు చేస్తూ ఉంటాడు. వ్యాపారంలో నష్టపోయిన చిలకలూరిపేటకు చెందిన అరవింద అనే మహిళకు సోషల్ మీడియా ద్వారా పూజారి నాగేశ్వరరావు పరిచయమయ్యాడు. అతన్ని నమ్మిన ఆమె తన సమస్య చెప్పుకుంది. గుప్త నిధులు కనిపెట్టడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని, అందుకు యువతలతో నగ్నంగా క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందని పూజారి ఆమెకు చెప్పాడు. దీంతో పూజల్లో నగ్నంగా కూర్చుంటే లక్ష రూపాయలు ఇస్తామని ఇద్దరూ ప్రచారం చేశారు.

CSK Vs KKR: చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెన్నైకి ఓటమి, సొంత గ్రౌండ్‌లో సీఎస్‌కేకు పరాభవం, ఆరు వికెట్ల తేడాలో KKR ఘనవిజయం

Dhoni Entry Video: స్టేడియంలోకి ధోనీ ఎంట్రీ చూస్తే గూస్‌ బంప్స్ ఖాయం, తలా వస్తుంటే రీసౌండ్ చూసి మతిపోవాల్సిందే! 

మధ్యవర్తుల ద్వారా..

నంద్యాల జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు యువతులను మధ్యవర్తుల  సాయంతో ఆకర్షించారు. డబ్బులు ఆశగా చూపి ఒప్పించి తీసుకొచ్చారు. అనంతరం పూజారి వారిని నగ్నంగా కూర్చోబెట్టి పూజలు నిర్వహించాడు. ఆ తర్వాత యువతులపై పూజరి, అతడి అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధిత యువతులు తప్పించుకుని దిశ యాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. పూజారి, అతడి అనుచరులు సహా మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Modi Govt Portal Will Find Lost Mobile: మీ మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయిందా? లేక దొంగిలించబడిందా? అయితే ఇకపై నో టెన్షన్.. 17వ తేదీన కేంద్రం ఓ ప్రత్యేక పోర్టల్ తీసుకురానుంది? ఏమిటా పోర్టల్ అంటే??