YSR Sankranthi Lucky Draw: వైఎస్సార్ సంక్రాంతి లక్కీ డ్రా.. గుంటూరు వాసికి రూ. 16 లక్షల విలువైన వజ్రాల హారం
16 లక్షల విలువైన వజ్రాల హారాన్ని దక్కించుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం రాత్రి ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కల్పలతారెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి మంత్రి అంబటి రాంబాబు ఈ డ్రా తీశారు.
Guntur, Jan 14: వైఎస్సార్ సంక్రాంతి లక్కీ డ్రాలో (YSR Sankranthi Lucky Draw) గుంటూరుకు (Guntur) చెందిన గుడే వినోద్ కుమార్ రూ. 16 లక్షల విలువైన వజ్రాల హారాన్ని (Diamond Necklace) దక్కించుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని జడ్పీ సుగాలి ఉన్నత పాఠశాలలో గురువారం రాత్రి ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కల్పలతారెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి మంత్రి అంబటి రాంబాబు ఈ డ్రా తీశారు. ఇందులో వినోద్ కుమార్ విజేతగా నిలిచి వజ్రాల హారాన్ని దక్కించుకున్నారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో గత రాత్రి అంబటి రాంబాబు వజ్రాల హారాన్ని వినోద్ కుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ పేరుతో అంబటి రాంబాబు లక్కీ డ్రా నిర్వహిస్తుండడం వివాదాస్పదంగా మారింది. సత్తెనపల్లిలో ఐదేళ్లుగా అంబటి రాంబాబు లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారన్న జనసేన నాయకుల ఫిర్యాదుపై గుంటూరు జిల్లా కోర్టు స్పందించింది. లక్కీ డ్రా వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సత్తెనపల్లి పోలీసులను గుంటూరు ప్రధాన సీనియర్ సివిల్ కోర్డు జడ్జి ఎ.అనిత రెండు రోజుల క్రితం ఆదేశించారు.