House Site Pattas: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు, తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా
ప్రభుత్వ బడులు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
Amaravati. August 18: వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి (House Site Pattas) సంబంధించి ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ బడులు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ న్యాయవాది యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. అంతేగాక దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ అంతా డ్రామా, చంద్రబాబుపై మండిపడిన ఏపీ హోంమంత్రి సుచరిత, ఆధారాలతో డీజీపీకి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన హోం మంత్రి
ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీలో న్యాయపరమైన సమస్యల కారణంగా ఈ కార్యక్రమం పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఆగస్టు 15న నిర్వహించాలని భావించిన ఈ కార్యక్రమం (YSR Jagananna housing colonies) అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ లోపే హైకోర్టు నుంచి వెలువడుతున్న వరుస ఉత్తర్వులు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. న్యాయ సమస్యలను అధిగమించలేకపోతే మరోసారి ఈ కార్యక్రమం వాయిదా పడే అవకాశాలూ లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.