MP Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు అంటూ వైరల్ వీడియో, అది మార్ఫింగ్ అంటూ క్లారిటీ ఇచ్చిన ఎంపీ, వీడియో నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపిన సజ్జల
ఎంపీగా ఉంటూ మహిళతో నగ్నంగా మాట్లాడారంటూ ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై గోరంట్ల మాధవ్ (Hindupur MP Gorantla Madhav) స్పందించారు.
Amaravati, August 4: అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు ( Hindupur MP Gorantla Madhav Video) అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంపీగా ఉంటూ మహిళతో నగ్నంగా మాట్లాడారంటూ ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై గోరంట్ల మాధవ్ (Hindupur MP Gorantla Madhav) స్పందించారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav Viral Video) మండిపడ్డారు.
నకిలీ వీడియోపై స్పందించిన ఆయన.. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఓ వీడియోలో తాను ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారని.. ఏ విచారణకైనా, ఫోరెన్సిక్ టెస్టుకైనా సిద్ధమన్నారు. ఆ వీడియో నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ ఉన్నారన్నారు. ఇప్పటికే ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని ఎంపీ తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే నన్ను స్ట్రయిట్‌గా ఎదుర్కోవాలన్నారు. ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘నేను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి ఈ చెత్త వీడియోలను సృష్టించారు. బాధ్యులపై పరువు నష్టం దావా వేస్తాను’’ అని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు.
ఇక ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అది వాస్తవం కాదని, పోలీసు కేసు కూడా పెట్టానని గోరంట్ల తనతో చెప్పారన్నారు. ఆ విషయంలో నిజంగా ఆయన తప్పు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా పార్టీ మహిళల పక్షపాత పార్టీ. నిజంగా తప్పు ఉంటే మా నాయకుడు ఊరుకోరు. టీడీపీ రాద్దాంతం చేస్తోంది. మా నాయకుడు చేతల్లో చూపిస్తారు. గోరంట్ల మాధవ్ పోలీస్ కేసు పెట్టారు. వాస్తవాలు తెలియాల్సి ఉంది. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాము’ అని స్పష్టం చేశారు.