Huge Fire At TVS Showroom: టీవీఎస్ షోరూంలో అగ్నిప్రమాదం, కాలిబూడిదైన 600 బైక్‌లు, దాదాపు 8 కోట్లకు పైగా ఆస్తినష్టం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానం
స్టెల్లా కాలేజ్ సమీపంలోని టీవీఎస్ షోరూమ్ లో మంటలు (Huge Fire At TVS Showroom) చెలరేగాయి. టీవీఎస్ షోరూం అగ్నికి ఆహుతి అయింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలకు షోరూంలోని కొత్త బైకులు కాలి బూడిదయ్యాయి. భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి.
Vijayawada, AUG 24: ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) జరిగింది. స్టెల్లా కాలేజ్ సమీపంలోని టీవీఎస్ షోరూమ్ లో మంటలు (Huge Fire At TVS Showroom) చెలరేగాయి. టీవీఎస్ షోరూం అగ్నికి ఆహుతి అయింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలకు షోరూంలోని కొత్త బైకులు కాలి బూడిదయ్యాయి. భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. తెల్లవారు జామున 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
అగ్ని ప్రమాదం సమయంలో షో రూమ్ లో 600కు పైగా టూ వీలర్స్ ఉన్నాయి. 500 ఎలక్ట్రిక్, పెట్రోల్ వాహనాలు తగల పడ్డాయి (Bikes Burnt To Ashes). షో రూమ్ లో ఎవరూ లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది.
టీవీఎస్ షోరూం యజమాని సతీష్ తెల్లవారుజామున 5 గంటల సమయంలో షోరూంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని వాచ్ మెన్ ఫోన్ చేశాడని టీవీఎస్ షోరూం యజమాని సతీష్ పేర్కొన్నారు. వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చి బయల్దేరి వచ్చామని తెలిపారు. అప్పటికే షోరూం పూర్తిగా మంటలతో నిండిపోయిందన్నారు. షోరూం లోపల 500 కొత్త ద్విచక్ర వాహనాలు ఉన్నాయని వెల్లడించారు. షోరూం బ్యాక్ సైడ్ సర్వీస్ ద్విచక్ర వాహనాలు 150 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. సర్వీస్ వాహనాలు, కొత్త వాహనాలు కలిపి మొత్తం ఎనిమిది కోట్ల రూపాయలపైనే నష్టం వాటిల్లిందని చెప్పారు. కొత్త వాహనాలకు ఇన్సూరెన్స్ పూర్తిగా వస్తుందని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ అయిందా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనేది తాము కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.