Guntur Badly Husband:డబ్బులు ఇస్తే భార్య నగ్న చిత్రాలు, డార్లింగ్ పేరుతో యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్, గుంటూరులో వికృత భర్తను అరెస్ట్ చేసొన పోలీసులు
గుంటూరులో డబ్బుల కోసం వికృత భర్త (Guntur Badly Husband) భార్య నగ్న చిత్రాలను యూట్యూబ్‌లో (Youtube) ఉంచి వాటిని కావాలనుకున్న వారికి అమ్మే ఘటన వెలుగులోకి వచ్చింది.
Guntur, Nov 24: భార్య భర్తల సంబంధాలు మంటగలిసి పోతున్నాయనే దానికి ఈ స్టోరీ ప్రత్యక్ష ఉదాహరణ. గుంటూరులో డబ్బుల కోసం వికృత భర్త (Guntur Badly Husband) భార్య నగ్న చిత్రాలను యూట్యూబ్‌లో (Youtube) ఉంచి వాటిని కావాలనుకున్న వారికి అమ్మే ఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్‌లో డార్లింగ్ పేరుతో వీడియోలను ఉంచి యువతను ఆకర్షిస్తున్న నిందితుడిని దిశ పోలీసులు (Disha Police) అరెస్టు చేశారు.
అతని వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి వివరాలు వెల్లడించారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం .. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన బొంతా వంశీకాంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని సౌదీ ఎయిర్‌లైన్స్ కార్గో విభాగంలో కొంతకాలం అక్కడ ఉద్యోగం మానేసి ఆరేళ్ల క్రితం గుంటూరులోని ఏటీ అగ్రహారానికి భార్యతో కలసి మకాం మార్చాడు. ఆ తర్వాత కొన్ని చిన్న వ్యాపారాలు చేసి నష్టాల పాలవ్వయ్యాడు. ఈ నేపథ్యంలో భార్యను అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. అయితే భార్య అందుకు ససేమిరా అనడంతో వంశీకాంత్ రెడ్డి ఈ ఏడాది జూన్‌లో భార్య నగ్న చిత్రాలను సెల్‌ఫోన్‌లో వీడియాలు తీసి యూట్యూబ్‌లో డార్లింగ్ పేరుతో అప్‌లోడు చేశాడు.
రూ.300 చెల్లిస్తే వాటిని కోరిన వ్యక్తులు చిత్రాలను డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాటు చేశాడు. ఈ నేపథ్యంలో గుంటూరు గాంధీనగర్‌కు చెందిన బచ్చు శివశంకర్ వీడియోను కొనుగోలు చేసి డౌన్‌లోడు చేసుకున్నాడు. టెక్కలికి చెందిన నిందితుడి స్నేహితుడు సంతోష్‌ను తన భార్యతో సంబంధం పెట్టుకోవాలంటూ వాట్సాప్‌లో చాటింగ్ చేశాడు. అప్పటినుంచి బాధితురాలికి సంతోష్ ఫోన్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతుండేవాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో తన నగ్న చిత్రాలు ఉన్నట్టు తెలుసుకుని కొద్దిరోజుల క్రితం నేరుగా అతని భార్య ఎస్పీని కలసి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు విచారించాలని దిశ డీఎస్పీని ఆదేశించారు.
టెక్నికల్ విభాగం సహకారంతో ఆధారాలు సేకరించి వంశీకాంత్ రెడ్డిని అరెస్టు చేశారు. అతనితో పాటు వీడియోలు డౌన్‌లోడు చేసుకున్న శివశంకర్‌ను కూడా అరెస్టు చేశారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ప్రధాన నిందితుడిపై హిస్టరీ షీట్ తెరుస్తామని ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభను కనపరచిన డీఎస్పీ కె.సుప్రజ, సిబ్బందికి ఎస్పీ క్యాష్ రివార్డులు అందించారు.