Andhra Pradesh Elections 2024: విడివిడిగా పోటీ చేస్తే జగన్‌ని ఆపలేం, అందుకే టీడీపీతో కలిసి పోటీ చేసి ముఖ్యమంత్రిని ఓడిస్తాం, చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఇదిగో..

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు

Pawan Kalyan (Photo-Video Grab)

Vjy, Sep 14: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తున్నాం. ఈ విషయం జనసేన కార్యవర్గం అర్థం చేసుకోవాలి.తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయని నేను ఇవ్వాళ నిర్ణయం తీసుకున్నాను. విడివిడిగా పోటీ చేస్తే వైఎస్సార్‌సిపిని ఆపలేం. ఇక నుంచి టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక అని పిలుపునిచ్చారు.

తెలుగుదేశం నేతలతో కలుస్తున్నానంటే అది పాలకపక్షం వల్లే. ఒక వైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్‌ల మధ్య ఉన్నానంటే అది పాలకపక్షం వల్లే. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును చట్టవ్యతిరేకంగా జైల్లో పెట్టారు. చంద్రబాబుకు నా మద్ధతు ప్రకటిస్తున్నా. గతంలో విధానాల పరంగా భిన్నమైన ఆలోచనలున్నాయి. అందుకే 2019లో వేర్వేరుగా పోటీ చేశాం. 2014లో విభజన జరిగినపుడు రాష్ట్రానికి నష్టం కలిగింది. 2014లో నేను నరేంద్ర మోదీకి మద్ధతు తెలిపాను.

చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్‌లో నిరసన, టీడీపీ కార్యకర్తలకు లాఠీ దెబ్బలు రుచి చూపించిన పోలీసులు, వీడియో ఇదిగో..

భారత్‌ మీద తరచుగా ఉగ్రదాడులు జరిగినపుడు బలమైన నాయకత్వం కావాలనుకున్నాను. నాడు నరేంద్ర మోదీ నన్ను పిలిస్తే నేను వెళ్లాను తప్ప.. నా అంతట నేను కాదు. చంద్రబాబుతో నాడు ప్రత్యేక హోదా కోసం విభేదించాను తప్ప.. ఆయనంటే నాకు నమ్మకం. చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా నాకు విశ్వాసం ఉంది. బ్యాంకులో తప్పు జరిగితే .. బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్‌ చేసినట్టుగా ఉంది. చంద్రబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విచారించాలి కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారిస్తుంది?’ అని అన్నారు.

Here's Video

గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోంది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమ కేసులు పెట్టి రిమాండుకు పంపించారు. వారికి సంఘీభావం ప్రకటించడానికి ఇక్కడకు వచ్చాను. చంద్రబాబుతో గతంలో విభేదించి సెపరేటుగా పోటీ చేశాను. రాజకీయాల్లో జనసేన తరఫున నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలని, దేశ సమగ్రత బలంగా ఉండాలనుకున్నా. జనసేన ఏర్పాటు చేసినప్పుడు కూడా అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగిందని చెప్పాను. సగటు మనిషి ఆవేదన గురించి మాట్లాడాను. ఆ రోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు చాలా మందికి ఇబ్బందిగా మారాయి.’’ అని అన్నారు.

 జీవోల్లో 13 చోట్ల చంద్రబాబు స్వహస్తాలతో చేసిన సంతకాలు, కేబినెట్‌ అనుమతి లేకుండానే కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని తెలిపిన ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌

నేను 2014లో నరేంద్రమోదీకి మద్దతు తెలిపిన సమయంలో ఆయన సొంత పార్టీ వ్యక్తులే ఆయన ప్రధాని కాకూడదని అనుకున్నారు. దక్షిణ భారతదేశం నుంచి నేను మోదీ మద్దతు తెలిపాను. ఈ రోజున నేను నా మనసును ఆవిష్కరిస్తున్నాను. దేశానికి చాలా బలమైన నాయకుడు కావాలి. మా నాన్నగారి అస్థికలు కాశీలో కలపడానికి వెళ్లినప్పుడు ముంబయిలో ఉగ్రవాదులు తాజ్‌ హోటల్‌పై దాడి జరిగింది. అంతకముందు పార్లమెంటుపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీగారికి మద్దతు తెలినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. ఆ రోజు నుంచి నరేంద్రమోదీ పిలిస్తే తప్ప నేను వెళ్లలేదని’’ అని పవన్‌ అన్నారు.

2014లో బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేయడానికి గల కారణం విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలని. ఆంధ్రప్రదేశ్‌కు చాలా అనుభవం ఉన్న నాయకుడు కావాలని భావించా. 2020 విజన్‌ గురించి మాట్లాడినప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. ఇవాళ లక్షలాది మంది మాదాపూర్‌ వంటి ఐటీ ప్రాంతాల్లో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఆయనతో ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే విభేదించా. వ్యక్తిగతంగా ఏనాడూ విభేదించలేదు. రూ.300 కోట్ల స్కామ్‌ పేరు చెప్పి సీఎంకు ఆ అవినీతి మరక అంటగడుతున్నారు.

గుజరాత్‌లో ప్రారంభమైన కంపెనీ కాంట్రాక్టు ఇచ్చారు. అది హార్డ్‌వేర్‌ను సప్లయ్‌ చేస్తుంది. ఏదైనా తప్పు జరిగితే ఆ సంబంధిత వ్యక్తులను విచారించాలి. అలాంటిది సైబరాబాద్‌ వంటి సిటీని నిర్మించిన వ్యక్తిని ఇలాంటి కేసులో ఇరికించడం బాధాకరం. ఈడీ విచారించాల్సిన ఇలాంటి కేసులను రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. ఇలా చేయడం రాష్ట్రానికి మంచిది కాదు. పోనీ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా మహానుభావుడా. ఇతనేమన్నా వాజ్‌పేయీనా? లాల్ బహదూర్‌ శాస్త్రినా? ఈడీ కేసులను ఎదుర్కొంటున్నాడు. దేశం విడిచి వెళ్లాలంటే కోర్టుల అనుమతి తీసుకుంటున్నాడు. రాజ్యాంగ ఉల్లంఘనలు చేసే వ్యక్తి. అందరినీ భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి. డేటా చౌర్యం జరుగుతోందని వాపోయిన వ్యక్తి ఇవాళ వాలంటీరు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అదే పని చేస్తున్నాడు.

అడ్డగోలు హామీలిచ్చి వేటినీ అమలు చేయలేదు. అడ్డగోలు దోపిడీ మాత్రమే చేస్తున్నారు. మద్యం విషయంలోనే కోట్లు జేబుల్లోకి వేసుకుంటున్నాడు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రశ్నించడానికే వీలులేకుండా పోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. నాలాంటి వ్యక్తులనే ఏపీ సరిహద్దుల్లో ఆపేస్తున్నారు. అలా ఆపే హక్కు ఎవరికీ లేదు. నమస్కారం పెట్టకూడదు. వాహనంలో నుంచి బయటకు రాకూడదని అంటున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లోనే చెప్పాను. దానికే 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానని కలగన్న వ్యక్తిలో ఉలికిపాటు మొదలైందని అన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now