Mekapati ChandraSekhar Reddy: వివాదంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నా తండ్రి మేకపాటి అంటూ మీడియాకు ఎక్కిన శివచరణ్, అతడో బ్లాక్ మెయిలర్ అంటున్న మేకపాటి..

చిన్నప్పటి నుంచి తనను రహస్యంగా ఉంచారని.. అయితే, తనకు కుమారుడు లేడని ఇటీవల తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెంది బయటకు వచ్చానని శివచరణ్ రెడ్డి వెల్లడించారు.

Image: Twitter

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కుమారుడిని తానేనని శివ చరణ్ రెడ్డి అనే వ్యక్తి బయటికొచ్చారు. చిన్నప్పటి నుంచి తనను రహస్యంగా ఉంచారని.. అయితే, తనకు కుమారుడు లేడని ఇటీవల తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెంది బయటకు వచ్చానని శివచరణ్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే మేకపాటి నా తండ్రి అంటూ శివచరణ్ రెడ్డి లేక విడుదల చేశారు.

మేకపాటి మాత్రం శివచరణ్‌ నా కొడుకు కాదంటున్నారు. తనకు కుమారుడే లేరని ఎమ్మెల్యే మేకపాటి స్పష్టం చేశారు. డబ్బుల కోసమే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని మండిపడ్డారు. శివచరణ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదని మేకపాటి తేల్చి చెప్పారు. మేకపాటి వ్యాఖ్యలపై శివచరణ్‌ స్పందించారు. నా ఊరు కొంపలో ఎవరిని అడిగినా వాస్తవం చెబుతారు.. నా సర్టిఫికెట్లన్నింటిలో మేకపాటి పేరు ఉంది.. ఐడెంటిటీ కోసమే నా తాపత్రయం అని శివచరణ్‌ రెడ్డి పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Telangana: తెలంగాణలో ఏ జిల్లాను రద్దు చేయడం లేదు, అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

CM Revanth Reddy: 98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి