Rythu Bharosa Extends To Tenant Farmers: ఏపీ కౌలు రైతులకు శుభవార్త, కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం, జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రైతు భరోసా పథకాన్ని(Rythu Bharosa scheme) కౌలు రైతులకు(Rythu Bharosa Extends To Tenant Farmers) వర్తింపజేస్తూ జీవో జారీ చేసింది. అలాగే అటవీ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసింది.
Amaravathi, Novemebr 26: కౌలు రైతులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం(AP Government) శుభవార్తను చెప్పింది. రైతు భరోసా పథకాన్ని(Rythu Bharosa scheme) కౌలు రైతులకు(Rythu Bharosa Extends To Tenant Farmers) వర్తింపజేస్తూ జీవో జారీ చేసింది. అలాగే అటవీ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసింది.
రైతు భరోసా నుంచి ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రైతు సంతానం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా కూడా వారికి రైతు భరోసా వర్తింస్తుందని జీవోలో పేర్కొంది. ఒక వేళ రైతు మరణిస్తే భార్యకు రైతు భరోసా సాయం అందించనుంది. ఆ తర్వాతి ఏడాది ఆ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఎవరి పేరుమీద ఉంటే వారికి రైతు భరోసా ఇచ్చేలా మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది.
గత నెలలో నెల్లూరు (SPSR Nellore) జిల్లా కాకుటూరులో సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ పథకాన్ని ప్రారంభించి కౌలు రైతుల(tenant farmers)కు రైతు భరోసా పథకం (Rythu Bharosa scheme) కార్డులు ఇవ్వడంతో పాటూ రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు ఇచ్చారు.
ఈ రైతు భరోసా పథకానికి రూ.5,510 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్కీం ద్వారా ఏపీలో 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం తెలిపింది. 3 లక్షల మంది కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుందని వివరించింది.
పెట్టుబడి సాయాన్ని రూ.12,500కు బదులు రూ.13,500 ఇవ్వాలని నిర్ణయించినట్లు వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు( Minister Kurasala Kannababu) ప్రకటించారు. అంతేకాదు నాలుగేళ్లకు ఐదేళ్ల పాటు పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. ఏటా రూ.13,500ను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తామన్న కన్నబాబు... మూడు విడతల్లో రైతు భరోసా డబ్బును పంపిణీ చేస్తామని వివరించారు. మేలో రూ.7,500, రబీలో రూ.4,000, సంక్రాంతికి రూ.2వేలు ఇస్తామని చెప్పారు.