Tirupati Laddu Controversy: సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైఎస్సార్‌సీపీ, వాస్తవాలు నిగ్గుతేల్చాలంటూ పిటిషన్
ఈ నేపధ్యంలో తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ.. హైకోర్టును ఆశ్రయించింది.
Vjy, Sep 20: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, పోర్క్ ఫ్యాట్ ఉందనే టీడీపీ బయటపెట్టిన రిపోర్ట్ కలకలం రేపుతోంది. ఈ నేపధ్యంలో తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ.. హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలను హైకోర్టు ధర్మాసనం వద్ద వైఎస్సార్‌సీపీ న్యాయవాదులు మెన్షన్ చేశారు.
తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం, ఆధారాలు ఇవిగో అంటూ బయటపెట్టిన టీడీపీ, ఖండించిన వైసీపీ
తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దేవుడి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది. వాస్తవాలు నిగ్గుతేల్చాలని... ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... వచ్చే బుధవారం పిటిషన్ పై వాదనలు వింటామని తెలిపింది.
గత వైసీపీ ప్రభుత్వం దారుణానికి పాల్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం, గత టీటీడీ యాజమాన్యంపై అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.