Jagananna Animutyalu: విద్యార్థులకు భరోసా, మీకు జగన్‌ మామ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన సీఎం జగన్, టాపర్లకు బహుమతులు ప్రదానం చేసిన ఏపీ ముఖ్యమంత్రి

ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షాలై.. రేపు ప్రపంచానికి ఫలాలు అందించాలని ఆకాంక్షించారు ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్‌ మైండ్స్‌.. షైనింగ్‌ స్టార్‌, ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీ మనదని ఉద్ఘాటించారు.

Jagananna Animutyalu (Photo-Video Grab)

Vjy, June 20: మంగళవారం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం కింద టాపర్స్‌ను విజయవాడలో సన్మానించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షాలై.. రేపు ప్రపంచానికి ఫలాలు అందించాలని ఆకాంక్షించారు ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్‌ మైండ్స్‌.. షైనింగ్‌ స్టార్‌, ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీ మనదని ఉద్ఘాటించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాం. కరిక్యులమ్‌ కూడా మారింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రతి విద్యార్థికి ట్యాబులు అందిస్తున్నాం. ప్రతీ విద్యార్థికి డిగ్రీ పట్టా ఉండాలనే తాపత్రయంతోనే.. విద్యా దీవెన, విద్యా వసతి చేపట్టాం. విద్యార్థుల ఫీజుల్ని ప్రభుత్వమే భరిస్తోంది. అత్యుత్తమ కంటెంట్‌తో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థులకు టెక్నాలజీ అందించే ప్రయత్నం చేస్తున్నాం. విదేశాల్లో సీటు తెచ్చుకుంటే ఆ విద్యార్థికి అండగా ఉంటాం. చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడం. మీ జగన్‌ మామ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని విద్యార్థులను ఉద్దేశించి స్పష్టం చేశారు.

లెటర్ ఇదిగో, ఇప్పటి వరకు ఎంత మంది తాట తీశావో చెప్పు, పవన్ కళ్యాణ్‌కి ఘాటు లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం

మీకు జగన్‌ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చదువుపై ధ్యాస పెట్టలేదు. 10వ తరగతిలో రాష్ట్రస్థాయి పస్ట్‌ ర్యాంకర్‌ నగదు పురస్కార రూ. 1 లక్ష. ద్వితీయ ర్యాంకు రూ. 75 వేలు, తృతీయ ర్యాంకు వారికి రూ. 50 వేలు నగదు పురస్కారం అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.ప్రభుత్వ స్కూల్స్‌లో చదువుతున్న పేద వర్గాల పిల్లలు ప్రపంచాన్ని ఏలే రోజు వస్తుంది. నిరుపేద వర్గాలు కూడా ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుతారని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడీకి సీఎం జగన్ అభినందనలు, ట్వీట్ ఇదిగో..

ఈ నాలుగేళ్లలో కేవలం విద్యా రంగ సంస్కరణలపైనే ప్రభుత్వం అక్షరాలా రూ.60,329 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యా సంస్థల్లో చదువుతూ.. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది, ఇంటర్మీడియట్‌ గ్రూపుల వారీగా టాపర్స్‌గా సత్తా చాటిన 26 మంది విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డులను ప్రదానం చేశారు.వీరితో పాటు ఉన్నత విద్యలో ఐదు కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు ‘స్టేట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు’ను ప్రదానం చేశారు.

పదో తరగతి విద్యార్థులకు..

► రాష్ట్రస్థాయి నగదు పురస్కారం: ప్రథమ స్థానం– రూ.1,00,000, ద్వితీయ స్థానం– రూ.75,000, తృతీయ స్థానం– రూ.50,000,విద్యార్థులు 42 మంది.

► జిల్లా స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.50,000, ద్వితీయ– రూ.30,000, తృతీయ– రూ.15,000, విద్యార్థులు 609 మంది.

► నియోజకవర్గ స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.15,000, ద్వితీయ– రూ.10,000, తృతీయ–రూ.5,000, విద్యార్థులు 681 మంది.

► పాఠశాల స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.3,000, ద్వితీయ–రూ.2,000, తృతీయ– రూ.1,000, విద్యార్థులు 20,299 మంది.

ఇంటర్‌ విద్యార్థులకు..

► రాష్ట్ర స్థాయి గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.1,00,000 చొప్పున 26 మంది విద్యార్థులకు ప్రదానం

► జిల్లా స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.50,000 చొప్పున 391 మంది విద్యార్థులకు ప్రదానం

► నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.15,000 చొప్పున 662 మందికి ప్రదానం

► మొత్తం విద్యార్థుల సంఖ్య: 22,710

ర్యాంకర్లకు సమాన మార్కులతో ఎంతమంది ఉన్నా అందరినీ సత్కరించనున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి నగదుతో పాటు సర్టిఫికేట్, మెడల్‌ అందజేస్తారు.