IPL Auction 2025 Live

Nadendla Manohar on Vizag Attck: వైసీపీది పబ్లిసిటీ స్టంట్! మంత్రుల కాన్వాయ్‌పై దాడి ఘటనలో నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు, వైసీపీ కార్యకర్తలే దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన నాదెండ్ల

మంత్రుల కాన్వాయ్ పై దాడి జరిగిందని, జనసైనికులే చేశారని పోలీసులు ఎక్కడా నిర్ధారించలేదన్నారు నాదెండ్ల. అలాంటప్పుడు తమపై బురదజల్లడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు

Image: Twitter

Vishakhapatnam, OCT 15: విశాఖలో మంత్రుల కాన్వాయ్ పై దాడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ (YCP), జనసేన (Janasena) నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికి జనసేన కార్యకర్తల పనే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మేుము తలుచుకుంటే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎక్కడా తిరగలేరని వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనికి పూర్తి బాధ్యత పవన్ కల్యాణ్ వహించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల విమర్శలు, ఆరోపణలపై జనసేన నాయకులు ఘాటుగా బదులిచ్చారు. మంత్రుల కాన్వాయ్ పై దాడిని (attack on cars ) వైసీపీ కుట్రగా అభివర్ణించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ కొత్త నాటకానికి తెరతీసిందని ఎదురుదాడికి దిగారు. మంత్రుల కాన్వాయ్ పై దాడి ఘటనపై జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar ) తీవ్రంగా స్పందించారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. వైసీపీ నాయకులపై ఎదురుదాడికి దిగారు. పవన్ విశాఖ పర్యటన, జనవాణిపై ప్రజలు, మీడియా దృష్టి మరల్చేందుకే వైసీపీ నాయకులు దాడి నాటకం ఆడారని ఆయన ఆరోపించారు.

మంత్రుల కాన్వాయ్ పై జనసైనికులు దాడి చేశారనడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రుల కాన్వాయ్ పై దాడి జరిగిందని, జనసైనికులే చేశారని పోలీసులు ఎక్కడా నిర్ధారించలేదన్నారు నాదెండ్ల. అలాంటప్పుడు తమపై బురదజల్లడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రులపై దాడి జరిగితే వారికి రక్షణగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. అలా జరిగుంటే అది పోలీసుల వైఫల్యమే అన్నారు నాదెండ్ల.

AP Minister Roja Attacked: విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత, మంత్రులు రోజా, జోగి రమేష్ పై దాడి, పవన్ విశాఖ పర్యటనలో జనసేన కార్యకర్తల అత్యుత్సాహం..  

విశాఖ గ‌ర్జ‌న‌కు హాజ‌రైన సుబ్బారెడ్డి (YV Subbareddy), రోజా (Roja), జోగి ర‌మేశ్(Jogi ramesh), పేర్ని నాని (Perni Nani) కార్య‌క్ర‌మాన్ని ముగించుకుని శ‌నివారం సాయంత్రం ఎయిర్‌పోర్టుకు బ‌య‌లుదేరారు. అదే స‌మ‌యంలో ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌ర్య‌ట‌న కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌కు స్వాగ‌తం ప‌లికేందుకు జ‌న సైనికులు భారీ సంఖ్య‌లో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ స‌మ‌యంలోనే వైసీపీ నేత‌ల కాJanasenaర్లు క‌నిపించ‌డంతో క‌ర్ర‌లు, రాళ్లతో జ‌న‌సైనికులు దాడికి దిగారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ దాడితో విశాఖ‌లో ఒక్క‌సారిగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.



సంబంధిత వార్తలు