pawan kalyan (Photo-Twitter/Janasena)

దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. ఇందులో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలిచాయి. ఇక తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ తో పాటు టీడీపీ, వైసీపీ కూడా గుర్తింపు పొందిన పార్టీలుగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులను రిజర్వ్ చేయనున్నట్లు ఈసీ తెలిపింది.

అయితే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీ మాత్రం గతంలో పొందిన గాజు గ్లాస్ సింబల్ ను కోల్పోయింది. ఆ గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. జనసేన పలు ఎన్నికలకు దూరంగా ఉండడం వల్లే తన గుర్తును కోల్పోయింది. ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా తమకు కేటాయించిన గుర్తును నిలుపుకోవాలంటే నిబంధనల ప్రకారం ఓట్ల శాతాన్ని తెచ్చుకోవాలి. అయితే జనసేన పార్టీ పలు ఉప ఎన్నికలకు దూరంగా ఉండటంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా తక్కువచోట్ల పోటీ చేసింది. ఈ కారణంగానే జనసేన తన గుర్తును కోల్పోయింది.

భూమా కుటుంబం-ఏవీ కుటుంబాల మధ్య గొడవేంటి, నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌, అఖిలతో పాటు 11 మందిపై పోలీసులు కేసు నమోదు

ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట జరిగిన బద్వేలు ఉప ఎన్నిక సమయంలోనే జనసేన ఆ గుర్తును కోల్పోయింది. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చింది. దీంతో నవతరం పార్టీ అభ్యర్థికి ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేనకు ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించగా.. ఆ పార్టీ శ్రేణులు సింబల్ ను జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాయి. తాజాగా ఈసీ ఆ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో జనసేనకు షాక్ తగినట్లయింది.

ఏపీ హైకోర్టు జడ్జి ప్రశాంత్ కుమార్ మిశ్రాకు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి, సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

వచ్చే ఎన్నికల్లో ఈసీ జనసేనకు మళ్ళీ గాజు గ్లాస్ గుర్తు కామన్ గా ఇస్తే పర్వాలేదు, లేకపోతే భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. గాజు గ్లాస్ సింబల్ జనసేనదిగా భావించి ఓట్లు వేసే అవకాశం ఉంది.



సంబంధిత వార్తలు

Andhra Pradesh Elections 2024: ఐదేళ్ల జగన్ పాలనలో గుండా, రౌడీ రాజ్యం, కలికిరిలో ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు, విజయవాడలో ముగిసిన ప్రజాగళం రోడ్ షో

2024 భారతదేశం ఎన్నికలు: ముగిసిన మూడో దశ ఎన్నికల పోలింగ్, దేశ వ్యాప్తంగా 61 శాతానికి పైగా ఓటింగ్ నమోదు, అత్యధిక ఓటింగ్ శాతంతో అస్సాం ముందంజ

Andhra Pradesh Elections 2024: చంద్రబాబు మేనిఫెస్టో చూసి బీజేపీ దూరంగా వెళ్లిపోయింది, కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేసిన వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని

Andhra Pradesh Elections 2024: టీడీపీ కూటమి మేనిఫెస్టోలో కనిపించని ప్రధాని మోదీ ఫోటో, చంద్రబాబు హామీలు బీజేపీ నమ్మడం లేదనడానికి ఇదే సాక్ష్యమని తెలిపిన సీఎం జగన్

Andhra Pradesh Elections 2024: ఏపీలో టీడీపీ కూటమి మ్యానిఫెస్టో ఇదిగో, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మెగా డీఎస్సీ మీద తొలి సంతకం

CM Jagan Bus Yatra: చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలపెట్టినట్లే...వెంకటగిరి బహిరంగ సభలో సీఎం జగన్

2024 భారతదేశం ఎన్నికలు: మా అన్న‌య్య జోలికి వ‌స్తే స‌హించేది లేదు! చిరంజీవిపై స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్

Pothina Mahesh on Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు! ఆధారాలు ఇవిగో అంటున్న జ‌న‌సేన మాజీ నేత‌, చంద్ర‌బాబును జైల్లో క‌లిసి వ‌చ్చాక పవ‌న్ ఏయే ఆస్తులు కొన్నాడంటే?