Ashwini Dutt: టీటీడీ ఛైర్మన్ గా ఆ స్టార్ ప్రొడ్యూస‌ర్ కు అవ‌కాశం, చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌డంతో చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త‌, ఇందులో నిజ‌మెంత‌?

ఎన్టీఆర్ ఉన్నప్పట్నుంచి ఆ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తూనే వచ్చారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ ని ఖండించి, కూటమి భారీగా గెలుస్తుందని చెప్పాడు.

Film producer Ashwini Dutt, Chandrababu

Amaravati, June 06: ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంతో గత ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, పలు పదవుల్లో ఉన్న వాళ్ళు రిజైన్ చేస్తుండగా త్వరలోనే కూటమి ప్రభుత్వం తరపున కొత్త వాళ్ళని నియమించనున్నారు. ఆల్రెడీ ప్రస్తుతం టీటీడీ(TTD) చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసాడు. దీంతో ఈ పదవి సినీ పరిశ్రమలో స్టార్ నిర్మాతకు రాబోతుందని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ (Ashwini Dutt) ముందు నుంచి కూడా టీడీపీ పార్టీనే. ఎన్టీఆర్ ఉన్నప్పట్నుంచి ఆ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తూనే వచ్చారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ ని ఖండించి, కూటమి భారీగా గెలుస్తుందని చెప్పాడు. అశ్వినీదత్ టీడీపీ సపోర్ట్ అని పరిశ్రమలో కూడా అందరికి తెలిసిందే.

Kalki Trailer Release Date: క‌ల్కీ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!ఆ రోజే రిలీజ్ చేస్తామ‌ని మూవీ టీమ్ ప్ర‌క‌ట‌న‌, ఇక‌పై ప్ర‌మోష‌న్స్ వేగం కూడా పెంచ‌నున్న యూనిట్ 

అలాగే అశ్వినీదత్ కు ఎన్టీఆర్ కుటుంబంతో, చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో టీడీపీ – జనసేన – బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఖాళీ అయిన టీటీడీ చైర్మన్ (TTD Chairman) పదవి నిర్మాత అశ్వినీదత్ కు దక్కుతుందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇవి ఎంతవరకు నిజం అనేది తెలీదు. అధికారికంగా ప్రకటించేదాకా ఎదురుచూడాల్సిందే. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమ నుంచి దర్శకుడు రాఘవేంద్ర రావు టీటీడీ మెంబర్ గా, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే SVBC ఛానల్ కు చైర్మన్ గా కూడా ఉన్నారు. దీంతో అశ్వినీదత్ కు కూడా టీటీడీ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇక అశ్విని దత్ ప్రభాస్ తో నిర్మిస్తున్న కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది.



సంబంధిత వార్తలు

AP Cabinet Meeting Highlights: ఏపీ డ్రోన్‌ పాలసీకి కేబినెట్ ఆమోదం, నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని తెలిపిన చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

New Guidelines for Air Passengers: విమాన ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం, ఇకపై ఫ్లైట్స్ భూమట్టానికి 3,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాతే వైఫై సేవలకు అనుమతి

AP TET Results 2024 Out: ఏపీ టెట్ ఫలితాల విడుదల, మీ రిజల్ట్స్ aptet.apcfss.in ద్వారా చెక్ చేసుకోండి, అర్హత సాధించిన అభ్యర్థులకు లోకేశ్ శుభాకాంక్షలు

Lady Aghori Naga Sadhu in AP: ఆత్మార్పణ అంటూ తెలంగాణలో హల్ చల్ చేసిన లేడీ అఘోరీ ఏపీలో ప్రత్యేక్షం.. అర్ధరాత్రి ఆత్మకూరులో ప్రత్యక్షమైన అఘోరీ (వీడియో)