Visakhapatnam Gas Leak: ప్రమాదానికి ప్రధాన కారణం అదే, విశాఖ గ్యాస్ లీకేజీపై ఏపీ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించిన హైపర్ కమిటీ, 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలు కొన్ని మీకోసం
ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ (High Power committee) ఏపీ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది. ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో (AP CM Camp Office) సోమవారం ముఖ్యమంత్రిని కలిసిన కమిటీ సభ్యులు, గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి తుది నివేదికను సమర్పించారు.
Amaravati, July 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన (LG Polymers Gas Leak) జరిగిన విషయం విదితమే. ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ (High Power committee) ఏపీ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది. ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో (AP CM Camp Office) సోమవారం ముఖ్యమంత్రిని కలిసిన కమిటీ సభ్యులు, గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి తుది నివేదికను సమర్పించారు. విశాఖపట్నం ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్, ఇద్దరు మృతి, నలుగురికి అస్వస్థత, ప్రమాద ఘటనపై ఆరా తీసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి (AP CM YS Jagan) సమర్పించిన నివేదికలో కమిటీ పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ (Forest Department Special Secretary Neerab Kumar) నేతృత్వంలోని కమిటీ 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ, హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమన్న అత్యున్నత న్యాయస్థానం
అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్(Industry Department Special Secretary Karikala Valavan), విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా (Visakhapatnam City Police Commissioner RK Meena), కలెక్టర్ సభ్యులుగా హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే 7న ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగిన తీరు, భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు మరోసారి పునరావృత్తం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలను కమిటీ తన నివేదికలో పొందుపరిచింది.
Here's Forest Department Special Secretary Neerab Kumar Video
ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని కమిటీ నివేదికలో పేర్కొంది. విశాఖలో జరిగింది కేవలం గ్యాస్‌లీకేజీ మాత్రమే కాదని అనియంత్రిక స్టైరిన్ కూడా పెద్ద ఎత్తున విడుదలైందని నీరబ్ కుమార్ తెలిపారు. ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలను కాపాడం చాలా కీలకమైన విషయమని, అయితే ఎల్జీ పాలిమర్స్ విషయంలో తీవ్ర తప్పిదం జరిగిందని పేర్కొన్నారు. 2019 డిసెంబర్‌లో రిఫ్రిజిరేషన్ పైపులు మార్చారని, దీనివల్ల కూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు.
ఫ్యాక్టరీలో ఉష్టోగ్రత కొలిచే పరికరం ట్యాంకు కింది భాగంలో అమర్చారు. దీనివల్ల ట్యాంకు మధ్యభాగంలో పైభాగంలో ఎంత టెంపరేచర్ నమోదు అవుతోంది అనే విషయం తెలుసుకోలేకపోయారు. స్టైరిన్ పాలిమరైజేషన్ అవుతోందని వారికి డిసెంబర్‌లోనే రికార్డు అయింది. కానీ దీనిని వారు హెచ్చరికగా భావించలేదు. ఓ వైపు ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరగడం, స్టైరిన్ బాయిలింగ్ పాయింట్‌కు చేరడం, ఆవిరి రూపంలో బయటకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. స్టైరిన్ ఆవిరి రూపంలో బయటకు వెళ్లడానికి కారణాలేంటో పూర్తిగా డయాగ్రామ్ రూపంలో నివేదికలో పొందుపరిచాం. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే... స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదం సంభవించింది.
ప్రమాదం జరిగిన తరువాత కూడా ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫ్యాక్టరీలో 36 చోట్ల అల్లారం పాయింట్‌లున్నాయి. ప్రమాదం జరిగినా సైరన్ మోగించలేదు. ఎల్జీ పాలిమర్స్‌లో అలారం ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యంగా చెప్పుకోవాలి. స్టైరిన్‌ను అదుపు చేసేందుకు కావాల్సిన రసాయనాలు పూర్తిస్థాయిలో ఫ్యాక్టరీలో లేవు. ఒకవేళ ఇలాంటి రసాయనాలు అందుబాటులో ఉంటే స్టైరిన్‌ను త్వరగా న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉండేది. ఈ రసాయనాలను గుజరాత్ నుంచి తెప్పించాల్సి వచ్చింది. అప్పటికే ట్యాంకుల్లో టెంపరేచర్ పూర్తిగా పెరిగిపోయిందని నివేదికలో తెలిపారు.
ఎల్జీ పాలిమర్స్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన ఫ్యాక్టరీ జనావాసాల్లో ఉండేందుకు వీల్లేదు అని నివేదికలో స్పష్టం చేశారు. ప్రమాదకర రసాయనాల ఫ్యాక్టరీలను జనావాసాల కంటే దూరంగా ఏర్పాటుచేయాలి. మాస్టర్ ప్లాన్ తయారు చేసే సమయంలోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్జీ పాలిమర్స్‌ను వేరే ప్రాంతానికి తరలించడం మంచిది అనే మా అభిప్రాయం’ అని నివేదికలో పొందుపరిచారు.
అలాగే ప్రభావిత గ్రామాల బాధిత ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, సీనియర్ జర్నలిస్ట్‌లు, అధికారులతో హైపవర్ కమిటీ చర్చించింది. నివేదిక సమర్పణ సందర్భంగా విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వినయ్ చంద్, నగర కమిషనర్ ఆర్కే మీనా పాల్గొన్నారు.
విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్‌ఆర్ వెంకటాపురం గ్రామంలోని బహుళజాతి కంపెనీ ఎల్‌జీ పాలిమర్స్‌లో మే 7 వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకై 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ వారాంత ప్రభుత్వ సహాయంతో చికిత్స పొంది కోలుకున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి బాధితులను ఆదుకుంది.