Black Fungus Treatment: సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, బ్లాక్ ఫంగస్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు, వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం

ఇప్పటికే కరోనా చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, తాజాగా బ్లాక్‌ ఫంగస్‌(మ్యుకర్‌ మైకోసిస్‌) (Mucormycosis) చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఉత్తర్వులు (Black Fungus to Aarogyasri Scheme) జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Mucormycosis (Photo Credits: Wiki)

Amaravati, May 19: కరోనా రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, తాజాగా బ్లాక్‌ ఫంగస్‌(మ్యుకర్‌ మైకోసిస్‌) (Mucormycosis) చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఉత్తర్వులు (Black Fungus to Aarogyasri Scheme) జారీ చేసింది.

ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) అధికారులను ఆదేశించారు. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడండంతో ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే (AP Govt) భరించనుంది.

కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే బ్లాక్ ఫంగస్ కు (Black Fungus) కూడా చికిత్స చేయాలని ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నిర్ణయించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సపై వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోను ఆదేశించింది. బ్లాక్ ఫంగస్ ఒక్క ఏపీలోనూ కాదు, దేశంలోని అనేక రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తోంది. రాజస్థాన్ ఇప్పటికే దీన్ని అంటువ్యాధిగా ప్రకటించింది.

సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ మిషన్లను ప్రాంభించిన ఏపీ సీఎం, ప్రభుత్వాస్పత్రులను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపిన వైయస్ జగన్

దేశ రాజధాని ఢిల్లీలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడి గంగారాం ఆసుపత్రిలో 40 మంది వరకు బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. దీని కారణంగా కంటి చూపు పోవడమే కాదు, రోగి మరణించే ప్రమాదం కూడా ఉండడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 3, కర్నూలులో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 1 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.