Vaccination in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్, టీకా పట్ల అపోహలు వద్దని ప్రముఖ వైద్య నిపుణుల సూచన, రాష్ట్రంలో కొత్తగా మరో 125 కొవిడ్ కేసులు నమోదు

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని, దాని వాళ్ళ ఎటువంటి ఇబ్బందులు కలగడం లేదని చెప్తున్నారు....

Image used for representational purpose (Photo Credits: IANS)

Amaravati, January 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ మహామ్మారి క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తోంది. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది. కరోనా వ్యాక్సిన్ పట్ల కొందరిలో అపోహలు నెలకొనడంతో ప్రముఖ వైద్య నిపుణులు ముందుకొచ్చి టీకా పట్ల అవగాహన కల్పిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని, దాని వాళ్ళ ఎటువంటి ఇబ్బందులు కలగడం లేదని చెప్తున్నారు. టీకా వేసుకుంటున్న వారందరూ ఆరోగ్యంగా ఉంటున్నారని, టీకా వేయించుకునేందుకు సంకోచించకుండా ముందుకు రావాలని సూచిస్తున్నారు.

రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,809 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 125 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,87,591కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,84,696గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో కృష్ణా జిల్లా నుంచి  26 కేసులు రాగా, గుంటూరు మరియు విశాఖ జిల్లాల నుంచి 19 చొప్పున అలాగే తూర్పు గోదావరి నుంచి 14 మరియు చిత్తూరు నుంచి 13 కేసులు  నమోదయ్యాయి, జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో మరో 2 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7152కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 175 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,79,131 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,308 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif