Janasena Alliance Row: జనసేన పొత్తులపై క్లారిటీ, ఏపీలో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళతాం, కొత్త పొత్తులు కలిస్తే వారితో కలిసి వెళ్తాం, స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్
ఏపీలో బీజేపీ, జనసేన మధ్య కొంతకాలంగా గ్యాప్ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. దాంతో రెండు పార్టీల మధ్య భాగస్వామ్యం ఉందా? లేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో కొండగట్టులో వారాహి వాహనానికి పూజలు చేసిన సందర్భంగా, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఏపీలో బీజేపీతో జనసేన పొత్తులోనే (Janasena Alliance Row) ఉందని స్పష్టం చేశారు.
Amaravati, Jan 25: ఏపీలో బీజేపీ, జనసేన మధ్య కొంతకాలంగా గ్యాప్ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. దాంతో రెండు పార్టీల మధ్య భాగస్వామ్యం ఉందా? లేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో కొండగట్టులో వారాహి వాహనానికి పూజలు చేసిన సందర్భంగా, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఏపీలో బీజేపీతో జనసేన పొత్తులోనే (Janasena Alliance Row) ఉందని స్పష్టం చేశారు.
బీజేపీతో పొత్తులోనే (Alliance with BJP will continue) ఉన్నాం అంటూ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారని, పొత్తులపై తామిద్దరం క్లారిటీతో ఉన్నామని సోము వీర్రాజు వెల్లడించారు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ఏపీలో ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు ఉంది! అందువల్ల రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే వెళ్తాం. కాదంటే ఒంటరిగానైనా వెళ్తాం. లేదా కొత్త పొత్తులు (Pawan Kalyan hints at new alliance) కలిస్తే వారితో కలిసి వెళ్తాం’’ అని పేర్కొన్నారు. ఏదేమైనా ఎన్నికల తేదీలు ప్రకటించడానికి వారం రోజుల ముందు మాత్రమే పొత్తులపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఓట్లు చీలకూడదనేదే తన అభిప్రాయమని పునరుద్ఘాటించారు.
మంగళవారం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో స్వామిని దర్శించుకుని ప్రచార రథం ‘వారాహి’కి వాహన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వారాహిపై నుంచి భక్తులు, అభిమానులు, కార్యకర్తలనుద్దేశించి తొలిసారి ప్రసంగించారు. వైసీపీకి 175కి 175 సీట్లు వచ్చేస్తాయన్న నమ్మకం ఉంటే ఇవన్నీ చేయక్కర్లేదని.. అయినా ఇవన్నీ చేస్తున్నారంటే వారి విశ్వాసం సన్నగిల్లుతోందని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేరని అర్థమని వ్యాఖ్యానించారు. రోజురోజుకూ ఏపీలో వైసీపీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు.
ఆంధ్రలో కులాల గీతల మధ్య రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ అధికారంలో ఉన్న వారు మామూలోళ్లు కాదు. సొంత బాబాయినే చంపించుకున్న వాళ్లు. ఏపీలో న్యాయ వ్యవస్థను ఇష్టానుసారంగా తిట్టేవాళ్లున్నారు. ప్రజాస్వామ్యం అనే పదానికి ఆ రాష్ట్రంలో విలువ లేదు. ఇలాంటి నాయకత్వం తెలంగాణలో లేదు’ అని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతోనే ఆంధ్రప్రదేశ్‌లో వారాహి వాహనానికి అనుమతి ఇవ్వలేదని విమర్శించారు.
టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించడాన్ని స్వాగతిస్తున్నానని, తెలుగు రాష్ట్రాలు బలంగా ఉండాలని పవన్ చెప్పారు. రెండు రాష్ట్రాల్లో సమస్యలు వేర్వేరని.. ఆంధ్రతో తెలంగాణను పోల్చిచూడలేమని, ఆ రాష్ట్రంతో పోల్చితే ఇక్కడ అభివృద్ధి చాలా జరిగిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మైనింగ్ దోపిడీ జరుగుతోందన్నారు. తెలంగాణలో జనసేన 7 నుంచి 14 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు.
ఇక్కడి అసెంబ్లీలో పది మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కచ్చితంగా పర్యటిస్తానన్నారు. తెలంగాణలో చిన్న పోలీసు ఉద్యోగానికి ఇన్ని పరీక్షలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో తాను లేనన్నారు. చాకలి ఐలమ్మ పోరాటం వల్లే జై తెలంగాణ అంటున్నామని తెలిపారు.
ఇక ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా పవన్ వ్యాఖ్యలను బలపరిచారు. బీజేపీతో పొత్తులోనే ఉన్నాం అంటూ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారని, పొత్తులపై తామిద్దరం క్లారిటీతో ఉన్నామని సోము వీర్రాజు వెల్లడించారు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని స్పష్టం చేశారు. నిన్న మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమంలో, తమ పొత్తు ప్రజలతోనే అని స్పష్టం చేసిన సోము వీర్రాజు... పవన్ వ్యాఖ్యల అనంతరం తన మాటలను సవరించుకోవడం గమనార్హం. జనసేన, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుందని అన్నారు.
పవన్ పర్యటనలో యువకుడి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
కొండగట్టు ఆలయం తనకు సెంటిమెంట్ అని పవన్ అన్నారు. ముఖ్యమైన ఏ కార్యక్రమాన్నైనా ఇక్కడి నుంచే ప్రారంభిస్తానని.. అందుకే వారాహికి కూడా ఇక్కడ పూజలు చేయించినట్లు చెప్పారు. కొండగట్టు ఆంజనేయస్వామి దయతో గతంలో తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని, అది తనకు పునర్జన్మలాంటిదన్నారు. దేశంలో అన్నిటికంటే సనాతన ధర్మం నిలబడాలని, ధర్మం నిలబెట్టడానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ కాన్వాయ్‌ని అనుసరిస్తున్న ఓ యువకుడు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొని మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం... వెల్గటూర్ మండలం ముక్కట్రావ్ పేటకు చెందిన కూస రాజ్‌కుమార్(22) ద్విచక్ర వాహనంపై కుమ్మరిపల్లికి చెందిన జక్కుల అంజి అనే మరో యువకుడితో కలిసి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌ని అనుసరిస్తున్నారు. పవన్ కల్యాణ్ ధర్మపురి పర్యటన ముగించుకొని వెల్గటూర్ మీదుగా హైదరాబాద్ తిరిగి వెళుతున్నారు.
కిషన్‌రావుపేట స్టేజి దాటిన తరువాత పవన్ కల్యాణ్ కాన్వాయ్‌ని ఓవర్‌టేక్ చేయాలని యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి, అదే వేగంతో ఎదురుగా వస్తున్న కారును కూడా ఢీ కొట్టారు. ఈ ఘటనలో రాజ్‌కుమార్ మృతి చెందాడు. జక్కుల అంజి, వీరు ఢీకొన్న ద్విచక్ర వాహనంపై ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్, నీలం సాగర్‌లకు కాళ్లు విరిగి తీవ్ర గాయాలయ్యాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)