Andhra Pradesh: ఏపీ పొలిటికల్ బ్రదర్స్, పవన్ మాట - లోకేష్ బాట, హాట్ టాపిక్‌గా అన్నాదమ్ముళ్ల వ్యవహారం!
వ్యక్తిగతంగా దూషించుకోవడమైనా, ఆ తర్వాత కలిసి పోవడమమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకే చెల్లుతుంది. అయితే కొంతమంది మాత్రం ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. వీరిలో ప్రధానంగా వినిపించే పేరు హైదరాబాద్ బ్రదర్స్. దివంగత పి జనార్ధన్ రెడ్డి(పీజేఆర్), మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాద్ బ్రదర్స్‌గా నిత్యం సమస్యలపై తమ గళాన్ని వినిపించే వారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో వినిపించిన మరో బ్రదర్స్ పేరు దానం నాగేందర్, దివంగత ముఖేష్ గౌడ్.
Vij, July 31: తెలుగు రాష్ట్ర రాజకీయాలకు దేశంలో ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. వ్యక్తిగతంగా దూషించుకోవడమైనా, ఆ తర్వాత కలిసి పోవడమమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకే చెల్లుతుంది. అయితే కొంతమంది మాత్రం ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. వీరిలో ప్రధానంగా వినిపించే పేరు హైదరాబాద్ బ్రదర్స్. దివంగత పి జనార్ధన్ రెడ్డి(పీజేఆర్), మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాద్ బ్రదర్స్‌గా నిత్యం సమస్యలపై తమ గళాన్ని వినిపించే వారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో వినిపించిన మరో బ్రదర్స్ పేరు దానం నాగేందర్, దివంగత ముఖేష్ గౌడ్.
ఇక తాజాగా ఇప్పుడు ఏపీలో పొలిటికల్ బ్రదర్స్‌గా మారారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్. ఎప్పుడైతే చంద్రబాబు జైలుకు వెళ్లారో అప్పటి నుండి వీరిద్దరి మధ్య బంధం చాలా బలపడింది. రోజురోజుకు వీరిద్దరి మధ్య పెరుగుతున్న అనుబంధంతో ఏపీ పొలిటికల్ బ్రదర్స్‌గా ముద్రపడే పరిస్థితి వచ్చింది.
వీరిద్దరి మధ్య బంధం ఎంతవరకు వెళ్లింది అంటే అన్న పవన్‌కు తోడుగా తమ్ముడు లోకేష్ ఒక విధంగా చెప్పాలంటే పవన్ మాట లోకేశ్ బాట అన్నట్లుగా వీరిద్దరి పొలిటికల్ జర్నీ సాగుతోంది. టీడీపీ కూటమిలో ప్రధానంగా చంద్రబాబక - పవన్ మధ్య ఎంత మంది విభేదాలు సృష్టించాలని ప్రయత్నించిన తమ్ముడు లోకేష్ మాత్రం పవన్‌ని సమన్వయం చేసుకుంటు ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది .
ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను ప్రారంభించగా పవన్ జనసైనికుల సమావేశంలో మాట్లాడుతూ డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సీన్ కట్ చేస్తే పవన్ చెప్పిన విధంగా విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి పవన్ చెప్పిన పేరునే ఖరారు చేశౄరు. అంతేగాదు నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ పవన్ నిర్ణయాలకు చాలా విలువనిస్తున్నారు లోకేష్. అన పవన్ చెప్పినట్లు ముందుకు సాగుతామని చెప్పే వరకు పరిస్థితి వెళ్లింది అంటే వీరిద్దరి మధ్య బాండింగ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మంత్రిగా లోకేశ్ ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు, ఆ తర్వాత పవన్‌కు పాదాభివందనం చేయడం ఇలా ఎన్నో సంఘటనలు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చకు దారి తీస్తున్నాయి. మొత్తంగా రాజకీయ ప్రత్యర్థులకు భవిష్యత్‌లో వీరిద్దరూ కొరకరాని కొయ్యలాగా మారిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని టాక్ నడుస్తోంది. ఏపీలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మళ్లీ తెరపైకి, న్యాయం చేయాలంటూ పవన్‌కు సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు, ఈ కేసులో మొదటి నుంచి ఏం జరిగిందంటే..