Pawan Kalyan Varahi Yatra: సీఎం జగన్‌ అందుకే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు! నా సినిమాలు ఆపాలనుకుంటే...ఆపండి, అవనిగడ్డలో సీఎం జగన్‌పై పవన్‌ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

అలాగే, తన సినిమాలకు టికెట్ల రేట్లు తగ్గించడానికి కారణం తన దగ్గర డబ్బులు ఉండకూడదు అని భావిస్తున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు.

Pawan Kalyan (Photo-Twitter)

Vijayawada, OCT 01: ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి కారణం వారి దగ్గర డబ్బులు ఉండకూడదు అని సీఎం జగన్ (CM Jagan) భావించడమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) ఆరోపించారు. అలాగే, తన సినిమాలకు టికెట్ల రేట్లు తగ్గించడానికి కారణం తన దగ్గర డబ్బులు ఉండకూడదు అని భావిస్తున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. జగన్ మన గురించి ఇలా ఆలోచిస్తారని అన్నారు. అందరూ ఆయన దగ్గర దేహీ అని ఉండాలి అనుకుంటారని చెప్పారు. తాను వెళ్లి సినిమా విడుదల అవుతుంది, కొంచెం టికెట్ల రేట్లు పెంచండని వేడుకుంటే వైఎస్ జగన్ కు ఆనందంగా ఉంటుందని పవన్ కల్యాణ్ (Pawan kalyan) చెప్పారు. సినిమాలు ఆపుకుంటే ఆపుకోవాలని, భయపడతా అనుకుంటున్నారా అని జగన్ ని పవన్ ప్రశ్నించారు. తాను భగత్ సింగ్ వారసుడిని, జగన్ కి భయపడే వాడిని కాదని పవన్ కల్యాణ్ అన్నారు.

 

ప్రజలు తమ 5 సంవత్సరాల విలువైన కాలాన్ని కోల్పోతే తిరిగిరాదని, జగన్ కు ఒక 5 సంవత్సరాలు అధికారం లేకపోయినా పర్లేదని చెప్పారు. ప్రజలు తమ విలువైన 5 సంవత్సరాల కాలం కోసం తనకు అవకాశం ఇవ్వాలని అన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి చూపిస్తానని చెప్పారు. 10 ఏళ్లుగా తాను ప్రజల కోసం నిలబడి ఉన్నానని, ఎక్కడికీ పారిపోలేదని తెలిపారు. ఒక్కసారి ప్రజల భవిష్యత్తు కోసం మాకు అవకాశం ఇవ్వాలని కోరారు.



సంబంధిత వార్తలు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif