Pawan Kalyan on PRC: పీఆర్‌సీపై ఇన్నాళ్లూ అందుకే మాట్లాడలేదు, పీఆర్‌సీ అంశంపై పవన్ ఫస్ట్ రియాక్షన్, జీతాలు పెంచామని చెప్తూనే...కోత విధించడమేంటని ప్రశ్నించిన జనసేనాని

ప్రజల అవసరాలు తీర్చాల్సిన ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన చేయడం బాధ కలిగించిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పిన వైయస్సార్సీపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాని గురించే పట్టించుకోలేదని విమర్శించారు.

Pawan Kalyan (Photo-Twitter)

Vijayawada Feb 03:  ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు చేస్తున్న పీఆర్‌సీ (PRC) ఉద్యమంపై స్పందించారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan ). నూతన పీఆర్సీ జీవోలకు(PRC G.O) వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు చేపట్టిన ‘చలో విజయవాడ(Chalo Vijayawada) ర్యాలీపై ఆయన వీడియో విడుదల చేశారు. ప్రజల అవసరాలు తీర్చాల్సిన ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన చేయడం బాధ కలిగించిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో సీపీఎస్‌ (CCS) రద్దు చేస్తామని చెప్పిన వైయస్సార్సీపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాని గురించే పట్టించుకోలేదని విమర్శించారు.

ఉద్యోగుల జీతాలు (Govt. Employees) భారీగా పెంచుతామని హామీలిచ్చిన ప్రభుత్వం.. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెంచలేదని, ఒకవైపు జీతాలు పెంచామని చెబుతూనే.. వారి జీతాల్లో కోత విధించడం ఉద్యోగులను మోసం చేయడమేనని పవన్‌ అన్నారు.

ఉద్యమంలో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయడం లేదని ఉద్యోగ సంఘాలు చెప్పినందునే ఈ అంశంపై ఇప్పటి వరకు మాట్లాడలేదని పవన్‌ అన్నారు.