Perni Nani Counter to RGV:టికెట్ల వివాదంపై ఆర్జీవీకి పేర్ని నాని కౌంటర్‌, ఆర్జీవీ వీడియోపై వరుస ట్వీట్లు చేసిన ఏపీ మంత్రి

డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma) వేసిన ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పేర్నినాని(Ap Minister Perni Nani). ఆర్జీవీ(RGV) వీడియోకు బదులుగా ఆయన వరుస ట్వీట్లు చేశారు.

Perni-Nani

Vijayawada January 05: ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో సినిమా టికెట్ల రేట్ల(Movie Tickets Price)పై వివాదం కొనసాగుతోంది. డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma) వేసిన ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పేర్నినాని(Ap Minister Perni Nani). ఆర్జీవీ(RGV) వీడియోకు బదులుగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘‘హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. ఏ హీరోకు ఇంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదని’’ మంత్రి పేరి నాని ట్వీట్‌ చేశారు.

ఇక సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే.. మెడికల్‌, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించడం లేదు. ధియేటర్లలో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం చెబుతోందని’’ పేర్ని నాని ట్వీట్‌ చేశారు.

ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందని ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రమని చెప్పారు. ఎవరికి వర్మగారూ? అమ్మే వారికా?.నిర్మాతల శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్‌ యాంగిల్‌ను గాలికొదిలేశారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మగారూ.. అంటూ మంత్రి పేర్ని నాని మరో ట్వీట్‌ చేశారు.

‘‘రూ.100 టికెట్‌ను రూ.వెయ్యి, రూ.2వేలకు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పిందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. దీన్ని ఏ మార్కెట్‌ మెకానిజం అంటారు. డిమాండ్‌ అండ్‌ సప్లై అంటారా లేక బ్లాక్‌ మార్కెట్‌ అంటారా?’’ అంటూ ట్వీటర్‌ వేదికగా మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు.

ఏపీలో మూవీ రేట్లను తగ్గించడంపై సినీ పరిశ్రమ నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇటీవల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేశారు. దీనికి పలువురు నటులు, దర్శకులు కూడా మద్దతుగా ట్వీట్లు చేశారు.



సంబంధిత వార్తలు