IPL Auction 2025 Live

PM Modi to Visit Vizag: రేపు విశాఖకు ప్రధాని మోదీ, పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని, సీఎం జగన్ విశాఖ టూర్ షెడ్యూల్ ఇదే..

ఈ నెల 11న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకోనున్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Schedule) ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో జరగనున్న పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొంటారు

PM Narendra Modi Phone Call to Ap CM YS Jagan (Photo-PTI)

Vizag, Nov 10: భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటన ఖరారు (PM Modi to Visit Vizag) అయింది. ఈ నెల 11న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకోనున్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Schedule) ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో జరగనున్న పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొంటారు. 11వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకొని ప్రధానికి స్వాగతం పలుకుతారు.

రాత్రి పోర్టు గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. 12వ తేదీ ఉదయం 9.40 గంటలకు ఏయూ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 10.20 గంటలకు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. 10.30 నుంచి 11.45 గంటల వరకు ప్రధానితో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. 12.20కి ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకొని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. 12.45లకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు.

డిసెంబర్ ఎస్‌ఈడీ కోటా టికెట్లను రేపు విడుదల చేయనున్న టీటీడీ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా నవంబర్ 11న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల

రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏపీ బీజేపీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు సంబంధించిన వివరాలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు వెల్లడించారు.ఈ మేరకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 11న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తామని వెల్లడించారు. కంచెర్లపాలెం నుంచి ఓల్డ్ ఐటీఐ వరకు కిలో మీటర్‌ మేర ఈ రోడ్‌ షో ఉంటుందన్నారు. 11న రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రధాని మోదీ రోడ్ షో జరుగుతుందని.. ఆ తర్వాత, ఐఎన్‌ఎస్‌ చోళలో బస చేస్తారని తెలిపారు.

ఇక, ఈ నెల 12న 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని.. అవన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులేనని ఎంపీ జీవీఎల్ చెప్పారు. ఇందులో రూ. 152 కోట్లతో చేపట్టే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ ముఖ్యమైందన్నారు. లక్షకు పైగా మత్స్యకార కుటుంబాలకు ఇదొక వరం లాంటిదని పేర్కొన్నారు. అలాగే, రాయ్‌పూర్- విశాఖ ఎకనామిక్ కారిడార్, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు డైరెక్ట్ రోడ్, గైయిల్ ద్వారా శ్రీకాకుళం నుంచి ఒడిశాలోని ఒంగుల్ వరకు పైప్ లైన్ నిర్మాణం, గుంతకల్లులో ఐవోసీఎల్‌ చేపడుతున్న ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చెయ్యడం లాంటివి ఉన్నాయని జీవీఎల్ వివరించారు.

ఇక, ప్రధాని పర్యటనలో ఏపీ రాజధాని అంశం లేదని ఎంపీ జీవీఎల్ తేల్చిచెప్పారు. కేవలం కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంశాలే ఉంటాయని వివరించారు. ఇప్పటికే రాష్ట్రానికి రైల్వే జోన్‌ను ప్రకటించామని.. త్వరలో దీనిపై నిర్ణయం ఉంటుందన్నారు. ఇది ప్రధాని మోదీ అధికారిక పర్యటన కాబట్టి.. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఆహ్వానించడంపై పీఎంవో నిర్ణయం తీసుకుంటుందన్నారు.. కానీ, ప్రధాని మోదీ విశాఖ పర్యటనను చిన్న చిన్న రాజకీయాల కోణంలో చూడొద్దన్నారు. ప్రధాని మోదీ ఒకటిన్నర రోజు విశాఖలో గడపడం వైజాగ్ ప్రజలకు ఎంతో గర్వకారణం అన్నారు. విశాఖ అభివృద్ధికి, బీజేపీ బలోపేతం కావడానికి ప్రధాని మోదీ టూర్ టేకాఫ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.