TTD: డిసెంబర్ ఎస్‌ఈడీ కోటా టికెట్లను రేపు విడుదల చేయనున్న టీటీడీ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా నవంబర్ 11న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల
Tirumala (File: Google)

డిసెంబర్‌కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను (SED tickets online quota) నవంబర్‌ 11న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో (TTD Online Booking) విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోరింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 2 క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 5, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు పడుతోంది.మంగళవారం అర్ధరాత్రి వరకు 22,423 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 9,679 మంది తలనీలాలు సమర్పించారు.

తిరుప‌తి శ్రీ క‌పిలేశ్వర‌స్వామివారి ఆల‌యంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను టీటీడీ జేఈవో వీర‌బ్రహ్మం అధికారుల‌తో క‌లిసి తనిఖీలు నిర్వహించారు. ఆలయంలోని పోటు, యాగశాల, క‌ల్యాణ క‌ట్ట‌, మ‌రుగుదొడ్లు, కార్యాల‌యం, ఇతర అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. స్వామివారి పుష్కరిణి అభివృద్ధి, ఆల‌య ప్రహ‌రీ గోడ మ‌ర‌మ్మత్తులు చేయాలన్నారు. జలపాతం నుంచి నీటి ప్రవాహం బ‌య‌ట‌కు వెళ్లే మార్గంలో గోడలు ప‌టిష్టంగా ఉండేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, రానున్న మూడు రోజులు పాటు ఏపీ తమిళనాడులో భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక

స్వామివారికి నూత‌నంగా త‌యారు చేస్తున్న చెక్క ర‌థం ప‌నుల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సంప్రోక్షణ నిర్వహించేందుకు త్వరిత పనులు పూర్తి చేయాలని , ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇంజినీరింగ్‌, ఆరోగ్య విభాగం వ్యర్థాల‌ను తొల‌గించి, పచ్చదనాన్ని పెంపొందించి సుందరంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారుల‌కు సూచించారు. కార్తికమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం లో జేఈవో దంప‌తులు పాల్గొన్నారు.