Journalist Murder Case: నంద్యాల యూట్యూబ్ విలేకరి హత్య కేసును చేధించిన పోలీసులు, మట్కా వ్యవహారంలో సస్పెండ్ అయిన కానిస్టేబులే సూత్రధారి, ఇద్దరు నిందితులను ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలించిన పోలీసులు
ఈకేసులో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య, అతని సోదరుడు నాగేశ్వరరావులను పోలీసులు అరెస్టు చేసి ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపర్చారు.
Nandyal, August 11: ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో సంచలనం రేపిన యూట్యూబ్ ఛానల్ విలేకరి హత్య కేసులో (Journalist Murder Case) నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసులో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య, అతని సోదరుడు నాగేశ్వరరావులను పోలీసులు అరెస్టు చేసి ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు ఈనెల 23 వరకు రిమాండ్ విధించడంతో అక్కడే సబ్ జైలుకు తరలించారు. నిందితుల వద్ద నుంచి పోలీసులు స్క్రూ డైవర్, కత్తి స్వాధీనం చేసుకున్నారు.
కాగా నంద్యాల పట్టణంలో ఓ యూట్యూబ్ ఛానల్ విలేకరిగా పనిచేస్తున్న కేశవ (32) ఆదివారం రాత్రి దారుణ హత్యకు (YouTube channel journalist Murder) గురయ్యాడు. పట్టణంలోని ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న కేశవ, అతని సహ ఉద్యోగి ప్రతాప్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్, అతడి సోదరుడు తమను ఆపారని విలేకరి మిత్రుడు ప్రతాప్ తెలిపారు. మాట్లాడాలని పిలవడంతో బైక్‌పై ఉన్న కేశవ పక్కకు వెళ్లారన్నారు.
Here's Update
ఇంతలో ఒక్కసారిగా కానిస్టేబుల్ తమ్ముడు స్క్రూ డ్రైవర్‌తో కేశవ శరీరంపై ఎనిమిది సార్లు పొడిచారు. తీవ్ర గాయాలైన కేశవను అతని మిత్రుడు ప్రతాప్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మట్కా వ్యవహారంలో సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ఓ వీడియో వైరల్ కావడంతో సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.