Rajinikanth Speech: కంటిచూపుతో బాలకృష్ణ ఏదైనా చేయగలడు! ఎన్డీఆర్ శతజయంతి వేడుకల్లో సూపర్‌స్టార్ రజినీకాంత్, హైదరాబాద్ వెళ్తే న్యూయార్క్‌లో ఉన్నట్లుంది! చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన రజినీ
నందమూరి తారకరామారావు యుగపురుషుడు అన్న రజినీకాంత్...తన చిన్న వయస్సు నుండే, ఎన్టీఆర్ (NTR) ప్రభావం ఉండేదన్నారు. తాను చూసిన మొదటి సినిమా పాతాళభైరవి అని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఎన్టీఆర్ కి వారసుడిగా బాలకృష్ణ తనదైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారన్నారు.
Vijayawada, April 28: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు (NTR@100) శతజయంతి ఉత్సవాల ప్రారంభోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది. పోరంకిలో అనుమోలు గార్డెన్స్ లో శతజయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...ఎన్డీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. నందమూరి తారకరామారావు యుగపురుషుడు అన్న రజినీకాంత్...తన చిన్న వయస్సు నుండే, ఎన్టీఆర్ (NTR) ప్రభావం ఉండేదన్నారు. తాను చూసిన మొదటి సినిమా పాతాళభైరవి అని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఎన్టీఆర్ కి వారసుడిగా బాలకృష్ణ తనదైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారన్నారు. బాలకృష్ణ (Balakrishna) కంటిచూపుతోనే ఏదైనా చేయగలిగిన సమర్థుడన్నారు రజినీకాంత్. ఆయన చేసిన స్టంట్లు తాను సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి హీరోలు కూడా చేయలేరని, చేసినా ప్రజలు ఒప్పుకోరని రజినీకాంత్ వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై కూడా రజినీకాంత్ ప్రశసంలు కురిపించారు. చంద్రబాబు (Chandrababu) ఐటీ విషయంలో ఏమి చేశారో, ఆయన ఘనత ఏమిటో ప్రపంచానికి తెలుసన్నారు. చంద్రబాబు కారణంగానే హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ వెళితే భారత్‌లో ఉన్నామా? న్యూయార్క్ లో ఉన్నామా? అనిపిస్తుందన్నారు రజినీకాంత్. ఇంత అభివృద్ధి చేసినందుకు సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు.
చంద్రబాబు తనకు 30 ఏళ్ల స్నేహబంధం ఉందని, ఇప్పటికీ తన ప్రతి పుట్టిన రోజుకు, తాను ఎక్కడ ఉన్నా సరే చంద్రబాబు తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తారన్నారు. చంద్రబాబుకు దేశ రాజకీయాలు మాత్రమే కాదు ప్రపంచ రాజకీయాలు కూడా తెలుసు అన్నారు.