Rayalaseema Garjana (Photo-Video Grab)

VJY, Dec 3: పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమలోని కర్నూలులో ఈ నెల 5వ తేదీన రాయలసీమ గర్జన (rayalaseema garjana) జరగనుంది. రాయలసీమ గర్జనకు లక్షలాదిగా తరలిరావాలని రాయలసీమ ఐక్య కార్యాచరణ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి (vijay kumar reddy President of Rayalaseema United Action) పిలుపునిచ్చారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు కావాల్సిందేనని తేల్చిచెప్పారు. అన్యాయం జరిగిన రాయలసీమ కన్నీళ్లను న్యాయ రాజధానితో తుడవాలన్నారు.

హైకోర్టుతో ఏమొస్తుందనే అపోహలు అర్ధరహితం. న్యాయ రాజధానితో, 9 జాతీయ రహదారులతో అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు. 10, 500 ఎకరాల్లో దేశంలోనే ఎనిమిదో అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చి, నిరుద్యోగిత సమసిపోతుందని అన్నారు. సీమకు రాజధాని రావాలంటే ప్రతి ఒక్కరి మద్దతు అవసరం. మనందరి భవిష్యత్తు కోసం జరిగే ఉద్యమానికి లక్షలాదిగా రావాలని కోరుతున్నామని విజయ్ కుమార్ తెలిపారు.

ప్రతిరోజు 80వేల మందికి వైకుంఠద్వార దర్శనం, .ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ, అన్ని ఆర్జిత సేవలు రద్దు, రూ. 300 టికెట్‌పై వచ్చేవారి సంఖ్యను కూడా పరిమితం చేస్తూ నిర్ణయం

రాయలసీమ గర్జన సభకు వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. రాయలసీమ హక్కుల కోసం జేఏసీ పోరాటం చేస్తోందని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జేఏసీ డిమాండ్‌ చేస్తోందన్నారు. డిసెంబర్‌ 5వ తేదీన కర్నూలులో జేఏసీ సమావేశం నిర్వహిస్తున్నారని, రాయలసీమ గర్జన పేరుతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

TTD New Decisions: టీటీడీ సంచలనాత్మక నిర్ణయాలు, ఇక నుంచి తిరుపతిలోనే సర్వదర్శనం టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనం టైమింగ్స్ మార్పు, డిసెంబర్ 01 నుంచి అమల్లోకి కొత్త రూల్స్ 

రాయలసీమ గర్జన సభకు తమ పార్టీ వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బుగ్గన పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని ప్రాంతాల వారిని మోసం చేశారని, పచ్చటి పొలాలను కూడా నాశనం చేశారని బుగ్గన మండిపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు మంత్రి.



సంబంధిత వార్తలు

AARAA Exit Poll: పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటున్న ఆరా మస్తాన్ సర్వే, లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని వెల్లడి

Andhra Pradesh Assembly Exit Poll: ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, అధికార వైసీపీకే మొగ్గు చూపిన మెజార్టీ సర్వేలు

Telangana Exit Poll: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ పైట్, బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్న సర్వేలు

Lok Sabha Exit Poll: అధికార బీజేపీ కూటమికే పట్టం కట్టిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల మధ్య వస్తాయంటే..

Andhra Pradesh Lok Sabha Exit Poll: ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..

Operation Chanakya Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన ఆపరేషన్ చాణక్య సర్వే, 95 నుంచి 102 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 64 నుంచి 68 సీట్ల మధ్యలో టీడీపీ

Chanakya Strategies Exit Poll: 114 నుంచి 125 సీట్లతో టీడీపీ అధికారంలోకి, 39 నుంచి 49 సీట్ల మధ్యలో వైసీపీ, Chanakya strategies Exit Poll ఇదిగో..

Avian Influenza Alert: ఏపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ డేంజర్ బెల్స్, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, మానవులకూ సోకే ఆస్కారం ఉందని వెల్లడి