YSRCP Spoke Persons: జగన్ మరో కీలక ప్రకటన, మాజీ మంత్రి రోజా- యాంకర్ శ్యామలకు కీలక పదవులు, పెద్దిరెడ్డికి సైతం పెద్దపీట వేసిన వైసీపీ అధినేత..కీలక పదవులు దక్కించుకున్న నేతలు వీరే
ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు కీలక పదవులు అప్పజెప్పిన జగన్ తాజాగా మరిన్ని కమిటీలను నియమించారు. అలాగే పార్టీ అధికార ప్రతినిధులను ప్రకటించారు.
Hyd, Sep 14: ఏపీలో అధికారం దూరమైన తనదైన శైలీలో ముందుకు వెళ్తున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు కీలక పదవులు అప్పజెప్పిన జగన్ తాజాగా మరిన్ని కమిటీలను నియమించారు. అలాగే పార్టీ అధికార ప్రతినిధులను ప్రకటించారు.
పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి,పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమించారు జగన్. అలాగే తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా పనిచేయనున్నారు పెద్దిరెడ్డి.
ఇక మరో కీలకమైన అధికార ప్రతినిధుల విషయంలోనూ జగన్ మార్క్ స్పష్టంగా కనిపించింది. తనకు సన్నిహితులైన భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకరరావు, ఆర్‌కే రోజా, యాంకర్ శ్యామలను అధికార ప్రతినిధులుగా నియమించినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
అలాగే వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్‌బాషా, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డిని నియమించారు. మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్, వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జునయాదవ్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతంరెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉషను నియమించారు. వీడియో ఇదిగో, పాపా నీకు 15 వేలు నీకు 15 వేలు అంటూ సెటైర్ వేసిన జగన్, పిఠాపురం పర్యటనలో ఆసక్తికర వీడియో వైరల్
Here's YSRCP Tweet:
ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోచంరెడ్డి సునీల్, వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్‌రాజు, గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా నారాయణమూర్తి, టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి (ప్రైవేట్ స్కూళ్లు), ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి (గవర్నమెంట్ స్కూళ్లు)గా ,అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను , అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా అనంత వెంకటరామిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా ఉషాశ్రీ చరణ్, తూర్పుగోదావరి జిల్లా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి నగర అధ్యక్షుడిగా మార్గాని భరత్ రామ్‌ని నియమించారు.
ఎన్నికల అనంతరం వైసీపీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి(చంద్రగిరి), మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి(పులివెందుల)లను నియమించారు. వైఎస్సార్‌సీపీ బీసీ విభాగానికి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించిన సంగతి తెలిసిందే.
Here's YSRCP Tweet: