Road Accident At Jaggayyapet: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టిన కారు నలుగురి మృతి, హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడెం వెళుతుండగా ప్రమాదం

కల్వర్టును ఒక కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Accident Representative image (Image: File Pic)

జగ్గయ్యపేట, మార్చి 13: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టును ఒక కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడెం వెళుతుండగా ఈప్రమాదం జరిగినట్లు తెలిసింది. జగ్గయ్యపేట గౌరవరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు..జగ్గయ్యపేట మండలం గౌరవరం సమీపంలో సాగర్ కెనాల్ వద్ద వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి కల్వర్టుని ఢీకొట్టింది. ఈప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు.

PF Withdrawal: మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు విత్ డ్రా చేయాలనుకుంటున్నారా? ఏయే సందర్భాల్లో, ఎంత డబ్బు విత్ డ్రా చేయవచ్చో తెలుసుకోండి.

అతి వేగమే..... అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కల్వర్టును వేగంగా కారు ఢీకొట్టడంతో మృతుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. సంఘటన స్థలికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif