IPL Auction 2025 Live

Cash Seized in AP: తెలంగాణ‌- ఏపీ స‌రిహ‌ద్దుల్లో భారీగా న‌గ‌దు స్వాధీనం, పైపుల్లో దాచి పెట్టి తీసుకెళ్తున్న రూ. 8.40 కోట్ల క్యాష్ సీజ్, ఇద్ద‌రి అరెస్ట్

గరికపాడు చెక్ పోస్టు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం రూ.8.39 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. పైపుల లోడ్ లారీలో ఈ నగదు పట్టుబడడం (Cash Seized) గమనార్హం. ఆ నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తుండగా సీజ్ చేశారు.

Huge amount of cash seized from household help of Jharkhand minister's aide during ED raids in Ranchi Watch Video

Vijayawada, May 09: ఎన్నికల వేళ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో (Jaggaiahpet) భారీగా నగదు పట్టుబడింది. గరికపాడు చెక్ పోస్టు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్  బృందం రూ.8.39 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. పైపుల లోడ్ లారీలో ఈ నగదు పట్టుబడడం (Cash Seized) గమనార్హం. ఆ నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తుండగా సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగదును హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు.

 

మరోవైపు, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటలో గంగాధర్ అనే వ్యక్తి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. కోటి రూపాయలకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే ఏపీలో భారీగా నగదు పట్టుబడింది. ఏపీలో ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులే సమయం మిగిలి ఉంది. ఆ తర్వాతి నుంచి డబ్బులు పంచే కార్యక్రమంలో నేతలు మరింత బిజీ అవుతారు. మే 13న ఎన్నికలు జరుగుతుండటంతో సర్వశక్తులొడ్డి ఎన్నికల పోరాటానికి సిద్ధమవుతున్నాయి ఏపీలోని పార్టీలు. తమకు కలిసొచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.