Sajjala Ramakrishna Reddy: టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను, మంగళగిరి పీఎస్‌లో విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి

ఇష్టానుసారం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

Sajjala Ramakrishna Reddy (Photo/X/YSRCP)

Vjy, Oct 17: టీడీపీ కూటమి కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ఇష్టానుసారం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ కార్యాయలంపై దాడి చేశారంటూ పెట్టిన అక్రమ కేసులో మంగళగిరి పీఎస్‌లో విచారణకు గురువారం ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ, అధికారం ఉందని అక్రమ కేసులు పెడుతున్నారు పాలనను గాలికొదిలేసి.. దాడులకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను. దాడి జరిగిన రోజు నేను బద్వేలులో ఉన్నా. వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో నేను ఉన్నట్టు నేను చెప్పినట్లు వాంగ్మూలంలో ఉంది. అది ఎలా సాధ్యం? స్వేచ్ఛగా తిరగకుండా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

4 నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దు బాబు అంటున్నారు, దేశంలోకెల్లా నంబర్‌ వన్‌ పార్టీగా మనం ఎదుగుతామంటూ వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

అక్రమ కేసులతో ఎయిర్‌పోర్టులో కూడా ఆపుతున్నారు.120 నిందితుడిగా నా పేరు చేర్చారు. ప్రజలు పాలించమని అధికారాన్ని ఇస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ కేసులు వైఎస్సార్‌సీపీ నేతల్లో ధైర్యాన్ని మరింత పెంచుతాయని సజ్జల స్పష్టం చేశారు. విష సంస్కృతి మొదలు పెట్టారు. విచారణ లేకుండానే ఎఫ్‌ఐఆర్‌లో ఎవరో వాంగ్మూలం ఇచ్చారని పేర్లు నమోదు చేస్తున్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలన్న భావిస్తే అది సాధ్యం కాదు. ఆ రోజు పట్టాభి ప్లాన్‌తోనే తప్పుడు మాటలు మాట్లాడారు. ఈ కేసును పొడిగించాలనే సీఐడీకి అప్పగించారు‌. ఎల్‌వోసి ఇవ్వడంపై కోర్టుకు వెళ్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.