Sankranti Trains Full: దసరా కూడా రాకుండానే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్.. కేవలం ఐదు నిమిషాల్లోనే బెర్త్‌ లు ఫుల్

సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ ఉన్నా సొంతూళ్ళకు చేరాల్సిందే.

Indian-Railway

Vijayawada, Sep 14: తెలుగువారికి ముఖ్యంగా ఆంధ్రులకు (Andhra) పెద్దపండుగగా పిలిచే సంక్రాంతి ఎంత ప్రముఖమైందో ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. సంక్రాంతి (Sankranti) వచ్చిందంటే ఎక్కడ ఉన్నా సొంతూళ్ళకు చేరాల్సిందే. అలా సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇంతమందికి రైళ్లు దొరకడం గగనమే. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవలసిన పరిస్థితి ఎప్పుడూ తారసపడుతుంది. ఇక, విషయంలోకి వస్తే, దసరా కూడా రాకుండానే.. ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉండగానే సంక్రాంతి రోజుల్లో హైదరాబాద్ నుంచి ఏపీకి దారితీసే రైళ్ల రిజర్వేషన్లు అన్నీ ఫుల్ అయ్యాయి.

సైబ‌రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, సైబ‌ర్స్ ట‌వ‌ర్స్ నుంచి వెళ్లే వారికి ప్ర‌త్యామ్నాయ మార్గాలివే!

ఈ రైళ్లు ఫుల్

వచ్చే ఏడాది జనవరి 11న హైదరాబాద్ నుంచి వెళ్లే విశాఖ, గోదావరి, ఫలక్‌ నుమా, కోణార్క్ తదితర రైళ్లకు శుక్రవారం  ఉదయం 8 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభం కాగా, కేవలం ఐదు నిమిషాల్లోనే అంటే 8.05 గంటలకే మొత్తం బెర్త్‌ లు నిండిపోయాయి. ఆ తర్వాత ప్రయత్నించిన ప్రయాణికులకు నిరాశ తప్పలేదు.

వరల్డ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌లో శ్రీశైలం దేవస్థానం, ఆలయ ప్రాముఖ్యత నేపథ్యంలో చోటు, వెల్లడించిన ఆలయ అధికారులు 

ఇదే తొలిసారి

సంక్రాంతికి ఇంకా నాలుగు నెలల ముందే రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ మరిన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif