Skill Development Case: స్కిల్ డెవలప్ మెంట్ కేసు, చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌‌పై విచారణ జనవరి 19కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఇవాళ జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మల ధర్మాసనం పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టింది

Supreme Court and Chandrababu (Photo-Wikimedia Commons/ FB)

Vjy, Dec 8: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇవాళ జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మల ధర్మాసనం పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై నేడు విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.

నేటి విచారణలో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. తాము కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. స్కిల్‌ కేసుకు సంబంధించి 17ఏ వ్యవహారంపై ఇప్పటికీ తీర్పు వెలువరించలేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 17ఏ వ్యవహారంపై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్‌ సాల్వే కోరారు. వాయిదా వేయకుంటే విచారణ తేదీని చెప్పాలని ధర్మాసనాన్ని కోరారు.ఈ కేసు వ్యవహారం 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని సాల్వే ప్రస్తావించారు.

ఏపీ పైబర్ నెట్ కేసు, చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ డిసెంబర్ 12కి వాయిదా

చంద్రబాబుకు ధర్మాసనం గతంలో నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు ముగిసిన అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... దీనిపై విచారణను జనవరి మూడో వారంలో చేపడతామని తెలిపింది. దాంతో, తేదీ ఖరారు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు విన్నవించారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు, డిసెంబర్‌ 8లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. జనవరి 19లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఆ కౌంటర్‌కు రిజాయిండర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.



సంబంధిత వార్తలు