Chandrababu Case Updates: ఏపీ పైబర్ నెట్ కేసులో (Fiber Net Case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో (Supreme Court) వాయిదా పడింది. డిసెంబర్ 12కు ఈ కేసుపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో ఈరోజు (గురువారం) విచారణకు రాగా... జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
డిసెంబర్ 12 వరకు వరకూ చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని న్యాయస్థానం ఆదేశించింది. గతంలో జారీచేసిన ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై తీర్పు రాస్తున్నామని న్యాయమూర్తి అనిరుద్ద బోస్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12 లోపు స్కిల్ కేసులో తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే చంద్రబాబు కేసులన్నింటికి క్వాష్ పిటిషన్ మూలంగా మారింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 17a సవరణ వాదనలపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. బెయిల్ రద్దుపై డిసెంబర్ 8లోగా లిఖితపూర్వక కౌంటరు దాఖలు చేయాలని సూచించింది. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే బెయిల్ రద్దుపై విచారణ జరగనుంది.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు డిసెంబర్ 5కు వాయిదా వేసింది. ఐఆర్ఆర్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ పై విచారణ జరిగింది. చంద్రబాబును కస్టడీకి కోరుతూ గతంలో పీటీ వారెంట్ వేసిన సీఐడీ. విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసిన న్యాయస్థానం.