IPL Auction 2025 Live

Skill Development Scam Case: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్‌లపై తీర్పు రిజర్వ్, సోమవారం తీర్పు వెలువరిస్తామని తెలిపిన ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

AP CM N Chandrababu Naidu (Photo Credit: ANI)

Vjy, Oct6: స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరిస్తామని తెలిపింది.

చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించండి, ఏసీబీ కోర్టులో మెమో దాఖలు దాఖలు చేసిన సీఐడీ

బెయిల్‌ పిటిషన్‌పై గురువారమే చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తి కాగా.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మరికొన్ని వాదనలు వినిపిస్తానని కోర్టును కోరారు. దీంతో నేడు ఆయన మరికొన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఆ తర్వాత సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరిగాయి.

చంద్రబాబు రిమాండ్‌ మరో 14 రోజులు పొడిగించిన ఏసీబీ కోర్టు, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా

సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదిస్తూ బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకోవాల్సి ఉందని.. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరారు. అనంతరం చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే వాదనలు వినిపించారు. ఇప్పటికే ఒకసారి చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇచ్చారని.. రెండోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.