Skill Development Scam Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు, డిసెంబర్‌ 8లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

ఈ కేసులో డిసెంబర్‌ 8లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది

Supreme Court and Chandrababu (Photo-Wikimedia Commons/ FB)

Vjy, Nov 28: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్‌ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ (AP CID) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. ఈ కేసులో డిసెంబర్‌ 8లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాలు ఎక్కడా మాట్లాడవద్దని చంద్రబాబుకు సూచించింది. అయితే, ర్యాలీలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మద్యం కేసులో తొందరపాటు చర్యలొద్దని ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం

చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఈ నెల 20న ఇచ్చిన సాధారణ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. స్కిల్‌ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడి, ఆ నిధులను టీడీపీ ఖాతాలకు మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదంటూ చంద్రబాబుకు ఏపీ హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్‌ ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సీఐడీ ఈ నెల 21న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది.