Skill Development Scam Case: సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్, ఈ రోజు ధర్మాసనం విచారిస్తుందా లేదా అనేదానిపై సస్పెన్స్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ పై ఏసీబీ కోర్టులో నేడు విచారణ

ఈ రోజు విచారణకు రాకుంటే ఇక రేపే సుప్రీం బెంచ్‌ ముందుకు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ రానుంది. లేదంటే వరుస సెలవుల నేపథ్యంలో అక్టోబర్ 3నే బాబు కేసు విచారణ జరిగే అవకాశం ఉంది.

Supreme Court and Chandrababu (Photo-Wikimedia Commons/ FB)

Vjy, Sep 26: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ ఆరోపణలపై అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఉన్న సంగతి విదితమే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, రిమాండ్‌ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. తన పిటిషన్‌ను గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి కొట్టేయడాన్ని సవాలు చేస్తూ ఆయన శనివారం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు.

సోమవారం ఈ కేసును చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. ఇందులో అత్యవసరత ఉన్నందున ఈ కేసుకు సంబంధించి మెన్షనింగ్‌ స్లిప్‌ ఇచ్చాం, పిటిషనర్‌ కస్టడీలో ఉన్నారు, ఇది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేసు, అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

నేడు చంద్రబాబు పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, రేపు మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని టీడీపీ అధినేత న్యాయవాదికి సూచన

సీజేఐ స్పందిస్తూ రేపు (మంగళవారం) రండి అని సూచించారు. ఎప్పటి నుంచి ఆయన కస్టడీలో ఉన్నారని ప్రశ్నించారు. ఆయన్ను 8న అరెస్టు చేసినట్లు సిద్ధార్థ లూథ్రా చెప్పారు. సీజేఐ సెప్టెంబర్‌ 8 నుంచా అని ప్రశ్నిస్తూ రేపటి మెన్షనింగ్‌లో రండి, ఏం చేయాలన్నది చూస్తాం అంటూ విచారణను ముగించారు. నేడు సుప్రీంకోర్టు లో రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభమైంది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పలు కేసులను విచారిస్తున్నారు.

సాధారణ కేసుల విచారణ ఇవాళ ఉండబోవని తెలుస్తోంది.చీఫ్ జస్టిస్ ముందుకు చంద్రబాబు కేసు మెన్షనింగ్ ఇంకా రాలేదు. ఈ రోజు విచారణకు రాకుంటే ఇక రేపే సుప్రీం బెంచ్‌ ముందుకు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ రానుంది. లేదంటే వరుస సెలవుల నేపథ్యంలో అక్టోబర్ 3నే బాబు కేసు విచారణ జరిగే అవకాశం ఉంది.

చంద్రబాబు నాయుడుకు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగింపు

ఇక స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణలో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై ఈరోజు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. అయితే, ఇప్పటి వరకు ఈ కేసులను విచారించిన ఏసీబీ జడ్జి ఈరోజు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నారు. వారి స్థానంలో ఏసీబీ కోర్టు ఇన్ఛార్జ్ జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి విధులను నిర్వర్తించనున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రెండు పిటిషన్లపై విచారణ జరపాల్సిందిగా ఇన్ఛార్జ్ జడ్జిని న్యాయవాదులు కోరనున్నారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif