Skill Development Scam Case: సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు రేపటికి వాయిదా, దాదాపు రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే

జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది

Supreme Court and Chandrababu (Photo-Wikimedia Commons/ FB)

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది.చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. 17ఏ లోని నిబంధనలను ఒక్కొక్కటిగా బెంచ్‌ ముందు హరీశ్‌ సాల్వే పెట్టారు. దీంతో మీ క్లయింట్‌ కేసులో 17ఏ వర్తిస్తుందనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ పేర్కొన్నారు.

చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, మూడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం, నేడు సుప్రీంకోర్టులో విచారణకు ఎస్‌ఎల్‌పీ

‘‘అవును.. బెంచ్‌ పరిశీలన వాస్తవమే. ఈ కేసులో అందరికీ బెయిల్‌ వచ్చింది. అసలు అరెస్ట్‌ అనేదే చట్టవిరుద్ధం’’ అని సాల్వే బదులు ఇచ్చారు. ఇదంతా చూస్తే 10 శాతం ప్రభుత్వం ముందుగా ఇచ్చి 90 శాతం సీమెన్స్‌ తర్వాత పెట్టడం మూలానా వచ్చినట్లుందని జస్టిస్‌ త్రివేది అభిప్రాయపడ్డారు. దీనికి హరీష్‌ సాల్వే బదులిస్తూ.. నేను కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు.

అయినా ఈ కేసులో నిందితులందరికీ ఇప్పటికే కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయినా మేం 17Aపైనే ఎందుకు వాదిస్తున్నామంటే అరెస్ట్‌ చేసిన విధానం సరికాదని. పార్లమెంటులో చట్టం తెచ్చిన ఉద్దేశ్యమేంటంటే.. ఈ సవరణ తర్వాత జరిగిన కేసులకు 17A SOP వర్తించాలని తెలిపారు. అయితే, మంగళవారం ఉదయం 10.30 గంటలకు తిరిగి వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ కోరారు. దీంతో రోహత్గీ అభ్యర్థనకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో దక్కని ఊరట, బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్‌లు డిస్మిస్‌ చేసిన కోర్టు

ఇక స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్‌ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్‌లను డిస్మిస్‌ చేసింది.