Skill Development Scam Case: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ ఇవిగో, టీడీపీ అధినేత క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ, మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసు విచారణ ప్రక్రియను నిలుపుదల చేయాలని చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ లో పేర్కొన్నారు.

chandrababu (Photo-TDP-Twitter)

Vjy, Sep 13: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల అక్రమాల కేసులో సీఐడీ తనపై నమోదుచేసిన కేసు (ఎఫ్‌ఐఆర్‌ 29/2021), దాని ఆధారంగా విజయవాడ అనిశా కోర్టు ఈ నెల 10న విధించిన జ్యుడిషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసు విచారణ ప్రక్రియను నిలుపుదల చేయాలని చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ లో పేర్కొన్నారు.

మంగళగిరి సీఐడీ ఎస్‌హెచ్‌వో, ఫిర్యాదుదారు/ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ కె.అజయ్‌రెడ్డిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. మంగళవారం హైకోర్టు ప్రారంభ సమయంలో చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌.. అవినీతి నిరోధక (సవరణ) చట్టం సెక్షన్‌ 17ఏ ప్రకారం పిటిషనర్‌ (పబ్లిక్‌ సర్వెంట్‌)పై కేసు పెట్టాలన్నా, దర్యాప్తు చేయాలన్నా గవర్నర్‌ నుంచి ముందస్తు ఆమోదం తప్పనిసరి అని, అలాంటిదేమీ లేకుండా చట్ట నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ వ్యవహరిస్తోందని జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి వద్ద ప్రస్తావించారు. అత్యవసర విచారణకు (లంచ్‌మోషన్‌) అనుమతించాలని కోరారు.

చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ కొట్టివేసిన ఏసీబీ కోర్టు,  జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామనే సీఐడీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం

ఇక రాజధాని నగర బృహత్‌ ప్రణాళిక, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అందిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ.. చంద్రబాబునాయుడిపై నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేష్‌రెడ్డి ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరపనున్నారు.

ఏపీ రాజధాని నగరానికి సంబంధించిన బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఎప్రిల్‌ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును మొదటి నిందితుడిగా పేర్కొన్నారు.

వీడియో ఇదిగో, రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు, 30 నిమిషాల పాటు మాట్లాడేందుకు ములాఖత్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో.. ప్రధాన నిందితుడు చంద్రబాబు నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ACB కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు నేటికి వాయిదా పడ్డాయి. చంద్రబాబు లాయర్లు ఈ పిటిషన్‌పై ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా ఆధారాలతో దొరికిపోయిన విషయం తెలిసిందే.దీంతో, ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చంద్రబాబు నిద్రలోకి వెళ్లాడు. ఉదయం నిద్రలేచి వాకింగ్, మెడిటేషన్ చేసిన చంద్రబాబు. బ్లాక్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్స్ చదివారు.స్నేహ బ్లాక్ మొత్తం సీసీ కెమెరాలతో పర్యవేక్షణలో ఉంది.



సంబంధిత వార్తలు