SSC Paper Leak Case: నారాయణ బెయిల్ రద్దు చేయండి, చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం, టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ కుట్ర ఉందని పిటిషిన్‌లో వెల్లడి
files petition) దాఖలైంది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో (SSC Paper Leak Case) ఈ నెల 10న నారాయణ అరెస్టయిన విషయం తెలిసిందే.
Chittoor, May13: టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్ ( AP govt. files petition) దాఖలైంది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో (SSC Paper Leak Case) ఈ నెల 10న నారాయణ అరెస్టయిన విషయం తెలిసిందే. 11వ తేదీ తెల్లవారుజామున నారాయణకు చిత్తూరు నాల్గవ అదనపు జడ్జి బెయిలు మంజూరు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో( question paper leakage case) నారాయణ కుట్ర ఉందని, బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరుపై జిల్లా కోర్టులో రివిజన్ ఫైల్ దాఖలు చేశామన్నారు. బెయిల్ పిటిషన్ వేయకుండా బెయిల్ మంజూరు అయ్యిందన్నారు. చట్టానికి ఎవరు అతీతులు కారు.. చట్టం ముందు అందరూ సమానమేనని’’ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. కాగా ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన నారాయణకు చిత్తూరు కోర్టు వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నారాయణ బెయిల్‌ను సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో గురువారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.