Sugali Preeti Case: ఏపీలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మళ్లీ తెరపైకి, న్యాయం చేయాలంటూ పవన్‌కు సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు, ఈ కేసులో మొదటి నుంచి ఏం జరిగిందంటే..

సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు.

Sugali Preeti Rape & Murder Case (photo-X?Janasena)

Vjy, July 31: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సుగాలి ప్రీతి తల్లి పార్వతి తన కుటుంబసభ్యులతో కలిసి కలిశారు. సుగాలి హత్యాచారం కేసును సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చారు కానీ.. సీబీఐ వరకూ వెళ్లలేని డిప్యూటీ సీఎంకు తెలిపారు.తమ బిడ్డకు జరిగిన అన్యాయం (Sugali Preeti Rape & Murder Case) మరే ఆడ బిడ్డకు జరగకుండా చూడాలని ఆమె (Sugali Preeti's Mother Parvati ) కోరారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు. దీంతో ఈ కేసుపై తగిన చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి హామీ ఇచ్చారు.  త్వరలో ఏపీలో పేకాట క్లబ్బులు,పేకాట ఆడకపోవడం వల్ల తగ్గిన జీవితకాలం, వైరల్‌గా టీడీపీ ఎమ్మెల్యే వీడియో

కర్నూలు నగర శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్‌.రాజు నాయక్, ఎస్‌.పార్వతిదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి రాజకీయ నేత కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పదవతరగతి చదువుతూ అనుమానాస్పద స్థితిలో 2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. ఇదే విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం తెలిపింది. అయితే తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్‌ యజమాని కొడుకులు బలవంతంగా రేప్‌ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.

Here's Video and Pics

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ శంకర్‌.. 20 ఆగస్టు 2017న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్‌లో సైతం అమ్మాయిని రేప్‌ చేసినట్లు నిర్ధారించారు.తమ దగ్గరున్న ఆధారాలతో తల్లిదండ్రులు కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్‌ యజమానితో పాటు.. అతడి కుమారులపై ఫిర్యాదు చేశారు.నిందితులపై పోలీసులు ఫోక్సో సెక్షన్‌ 302, 201, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ హత్య సంఘటనపై విచారణకు ముందుగా త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్.. తర్వాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. విద్యార్థినిపై లైంగిక దాడి చేసి.. హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. అమ్మాయి శరీరంపై ఉన్న గాయాలను, అక్కడి దృశ్యాల పట్ల అనుమానం వ్యక్తం చేసింది.23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. దీంతో తమ బిడ్డను రేప్‌ చేసి చంపిన వారిని శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగారు.దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది