AP Fibernet Case: ఫైబర్‌నెట్‌ కేసు విచారణ ఈ నెల 30కి వాయిదా, దీపావళి సెలవుల తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ కేసు తీర్పు వెలువరిస్తామని తెలిపిన సుప్రీంకోర్టు

ఈనెల 30న విచారణ చేపడతామని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తెలిపింది

Supreme Court and Chandrababu (Photo-Wikimedia Commons/ FB)

Vjy, Nov 9: ఫైబర్‌ నెట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ వాయిదా పడింది. ఈనెల 30న విచారణ చేపడతామని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తెలిపింది. క్వాష్‌ పిటిషన్‌ తీర్పు తర్వాతే ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌పై విచారణ చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

ఏపీ సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. ఫైబర్‌నెట్‌ కేసులో ఈనెల 30 వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించింది. మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. క్వాష్ పిటిషన్ పై విచారణ గత నెలలోనే ముగిసింది. తీర్పును ధర్మాసనం రిజర్వ్ లో ఉంచింది. ఈ నెల 23లోగా క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాతే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ జరుపుతామని సుప్రీం తెలిపింది.

ముసుగు తీసేసిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థిగా నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడి

సెక్షన్‌ 17ఏ నిబంధన ఈ కేసులోనూ ఉన్నందున స్కిల్‌ కేసు తీర్పు వచ్చాక విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కేసు ముగిసేవరకూ అరెస్ట్‌ చేయబోమన్న నిబంధన కొనసాగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. గత హామీ మేరకే ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలిపారు. కేసు విచారణను ఈనెల 23కి వాయిదా వేయాలని తొలుత ధర్మాసనం నిర్ణయించింది. అయితే సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తి మేరకు విచారణను సుప్రీంకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.

అక్రమాస్తుల కేసు, సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు, పిల్‌కు నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు

ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆయన విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. దీంతో, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు.



సంబంధిత వార్తలు

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్