RTC Workers Row: ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే, ఆర్టీసీ ఉద్యోగులు స్థానికత అంశంపై హైకోర్టు విధించిన స్టేని సుప్రీంలో సవాల్ చేసిన ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీ రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ

ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న ఉద్యోగులు, టీఎస్‌ఆర్టీసీకి (TSRTC) నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు.. జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును సోమవారం విచారించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (Joint Andhra Pradesh) ఏపీ స్థానికత కలిగిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు తెలంగాణలో విధుల్లో చేరి బదిలీ, డిప్యుటేషన్లపై స్వస్థలమైన ఆంధ్రాలో విధులు నిర్వర్తించారు.

Supreme Court of India |(Photo Credits: IANS)

Amaravati, Oct 6: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆర్టీసీ కార్మికుల విభజన వ్యవహారానికి (RTC Workers Row) సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న ఉద్యోగులు, టీఎస్‌ఆర్టీసీకి (TSRTC) నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు.. జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును సోమవారం విచారించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (Joint Andhra Pradesh) ఏపీ స్థానికత కలిగిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు తెలంగాణలో విధుల్లో చేరి బదిలీ, డిప్యుటేషన్లపై స్వస్థలమైన ఆంధ్రాలో విధులు నిర్వర్తించారు.

అయితే రాష్ట్ర విభజన అనంతరం వీరి అసలు పోస్టింగ్‌ అయిన తెలంగాణకు వెళ్లిపోవాలంటూ ఏపీఎస్‌ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రా స్థానికత కలిగిన తమను తెలంగాణకు పంపడం అన్యాయమని ఆర్టీసీ సిబ్బంది హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఉత్తర్వులను హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం పక్కనపెట్టింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ప్రధానితో ముగిసిన ఏపీ సీఎం సమావేశం, 17 అంశాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలిపిన అధికార వర్గాలు, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్న ఏపీ సీఎం

ఇక ఏపీ రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. పరిపాలన వికేంద్రీకరణ చట్టంలోని సెక్షన్ 8లో.. ఎక్కడైతే సీఎం ఉండి పనిచేస్తారో అదే క్యాంప్ కార్యాలయమని ఏజీ తెలిపారు. స్టేట్ కార్పొరేషన్లు అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. గత సీఎంకు నారావారిపల్లిలో, హైదరాబాద్‌లో క్యాంప్ ఆఫీసులున్నాయన్నారు. క్యాంప్ కార్యాలయాల ఏర్పాటుపై.. పూర్తిస్థాయి అఫిడవిట్‌ను శుక్రవారం అందజేస్తామని తెలిపారు. ఏజీ అభ్యర్థన మేరకు విశాఖ గెస్ట్‌హౌస్‌పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.



సంబంధిత వార్తలు