Swarnandhra Vision 2047: నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం... విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఉదయం 8 గంటల్లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని సూచన

ఈ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

AP CM Chandrababu 'Mann Ki Baat' Soon!(X)

Vijayawada, Dec 13: విజయవాడలో (Vijayawada) నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 (Swarnandhra Vision 2047) కార్యక్రమాన్ని ఏపీ సర్కారు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ  ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. నగరంలోని బందర్ రోడ్డుపై బస్సులు, ఆటోలకు అనుమతి లేదని వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి వచ్చే వాహనాలకు మాత్రమే ఆ మార్గంలో అనుమతిస్తామని గుర్తు చేశారు.

తెలంగాణపై చలిపులి ప్రతాపం.. శనివారం వరకు రాష్ట్రంలో తీవ్ర చలిగాలులు వీస్తాయన్న ఐఎండీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

సహకరించాలని విజ్ఞప్తి

ఆంక్షలు విధించిన నేపథ్యంలో విజయవాడ ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందరూ ఉదయం 8 గంటల లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని సూచించారు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రపంచ చెస్ ఛాంపియన్‌ గుకేశ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, మిలియన్ల మంది యువకులు పెద్ద కలలు కనడానికి నీ విజయం ప్రేరణ అంటూ ట్వీట్