Rumors On Sivaprasad Death : టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారంటూ వార్తలు, వదంతులు నమ్మవద్దంటున్న ఆయన మనవడు, ఖండించిన కుటుంబ సభ్యులు

కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ దానికి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ శివప్రసాద్‌ చనిపోయారు.

File Image of Former Member of the Lok Sabha, Naramalli Sivaprasad

Chennai, September 20:  చిత్తూరు మాజీ ఎంపీ శివ ప్రసాద్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన మనవడు స్పందించాడు. ఆయన ఆరోగ్యం బాలేదంటూ వచ్చిన వార్తలను నమ్మొద్దని అతడు కోరాడు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో వారం రోజుల క్రితం తమ తాతయ్యను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించామని.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలిపాడు. తమ తాతయ్య ఆరోగ్యం మెరుగుపడాలని దేవుడిని ప్రార్థించాలని ఈ సందర్భంగా అభిమానులను కోరారు. ఈ మేరకు అతడు ఓ వీడియోను విడుదల చేశాడు. కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శివ ప్రసాద్ శుక్రవారం చనిపోయారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. శివ ప్రసాద్ చికిత్సకు స్పందిస్తున్నారని వారు పేర్కొన్నారు.

కాగా, ఎలాంటి బలమైన ఆధారాలు లేకుండానే కొన్ని మీడియా సంస్థలు శివప్రసాద్ చనిపోయారంటూ వార్తలు ప్రచురించడం, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శివప్రసాద్ చనిపోయాడన్న వార్త తెలుగు దేశం పార్టీగానీ, నాయకులు గానీ లేదా వారి అనుబంధ మీడియా సంస్థలు గానీ ఎక్కడా ధృవీకరించలేదు. విచిత్రంగా ఆయనకు సంబంధించిన వికీపీడియా పేజీలో కూడా నారమల్లి శివప్రసాద్ చనిపోయారనే వార్తలకు బలాన్ని చేకూర్చేలా మరణం సెప్టెంబర్ 20, 2019 అని చూపిస్తుంది. అయితే వికీపీడియా పేజీని ఎవరైనా ఎడిట్ చేయొచ్చు, మరి ఈ పనిచేసిందెవరో తెలియాల్సి ఉంది.

Sivaprasad Wikipedia Page

అయితే ఆయన చనిపోయారన్న అసత్య వార్తలకు బ్రేక్ పడేలా మాజీ సీఎం చంద్రబాబు ఆయనను పరామర్శించి వచ్చానని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Chandrababu Tweet:

సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చిన శివప్రసాద్ 1994 - 2004 మధ్య ఎమ్మెల్యేగా ఎన్నికై, చంద్రబాబునాయుడి కేబినెట్‌లో సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. 2009, 2014లో ఆయన చిత్తూరు ఎంపీగా ఉన్నారు. స్వతహాగా నటుడైన శివప్రసాద్ ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ రకరకాల వేషధారణల్లో నిరసనలు తెలిపేవారు. జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు.