JC Prabhakar Reddy Arrest: టీడీపీకి మళ్లీ షాక్, పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్, బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించారని ఆరోపణలు
ఆ పార్టీ టెక్కిలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ పోలీసులు అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ చేసిన ఉదంతం మరచిపోకముందే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని (JC Prabhakar Reddy Arrest) పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని (Asmith Reddy) అనంతపురం పోలీసులు (Anantapur police) అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Amaravati, June 13: టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ టెక్కిలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ పోలీసులు అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ చేసిన ఉదంతం మరచిపోకముందే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని (JC Prabhakar Reddy Arrest) పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని (Asmith Reddy) అనంతపురం పోలీసులు (Anantapur police) అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్ ఎన్‌ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి. కాగా.. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదయ్యాయి. రూ.150 కోట్ల ఈఎస్‌ఐ కుంభకోణం, టెక్కిలి టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ, స్కాం వివరాలను వెల్లడించిన ఏసీబీ డైరెక్టర్ రవికుమార్
154 బస్సులు నకిలీ NOC, ఫేక్ ఇన్స్యూరెన్స్ కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది దీంతో పాటుగా బీఎస్ 3 వాహనాల విషయంలో కూడా వీరిపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ వ్యవహారంలో వారిపై గతంలోనే కేసులు నమోదు చేశారు. ఈ వాహనాలు ఏపీ, నాగాలాండ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయని.. ఒకే నకిలీ ఇన్స్యూరెన్స్ పాలసీని నాలుగైదు వాహనాలకు చూపినట్లు రవాణాశాఖ గుర్తించింది. జఠాధర, గోపాల్ రెడ్డి కంపెనీల పేర్లతో అశోక్ లేలాండ్ స్క్రాప్ అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆగస్టు నుంచి గ్రామాల్లోకి వైయస్ జగన్, ఎవరైనా పథకాలు అందలేదని ఫిర్యాదులు చేస్తే అధికారులే బాధ్యులు, ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం
కాగా జేసీ ట్రావెల్స్ 154 బీఎస్-3 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిందని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు ఇదివరకే వెల్లడించారు.అనంతపురంలో 80, కర్నూలులో 5, చిత్తూరులో 5, కడపలో 3 వాహనాలు రిజిస్ట్రేషన్లు రద్దు చేశామని తెలిపారు. నెల్లూరులో ఉన్న 6 వాహనాలపై కోర్టు కేసులు ఉన్నందున.. రిజిస్ట్రేషన్ల రద్దు వాయిదా వేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 62 వాహనాలు సీజ్ చేశామని, మరో 39 వాహనాలు సీజ్ చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో 12 వాహనాలు గుర్తించి ఆ రాష్ట్రానికి సమాచారం ఇచ్చామన్నారు. జేసీ ట్రావెల్స్ వాహనాలను కొనుగోలు చేసిన వారిని ముందే హెచ్చరించామని, 71 నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా గుర్తించామని పేర్కొన్నారు. జేసీ ఉమారెడ్డి, జేసీ అశ్మిత్‌రెడ్డి జటాధర ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్నారని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు
ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా నేషనల్ డేటా బేస్డ్‌కు తీసుకోమని కేంద్రంకు మార్చి 18 న లేఖ రాశామని జేటీసీ తెలిపింది. ఇంతవరకు 95 వెహికల్స్ రిజిస్ట్రేషన్ రద్దు చేశామని.. 6 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. 31 వాహనాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాల్సి ఉందని నెల్లూరు వారు కొందరు వాహనాలు కొన్నారని చెప్పుకొచ్చారు. వారు ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళనలు చేశారని.. ఆయన కొందరితో మాట్లాడి సెటిల్ చేసుకొనే యత్నం చేశారని అది ఫలించలేదన్నారు.
కొద్దిరోజుల క్రితం దివాకర్ ట్రావెల్స్ మేనేజర్ నాగేశ్వరరెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకు ముందు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. లారీ ఇంజిన్ నంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ప్రభాకర్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ కేసులకు సంబంధించి తాను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. కాగా ఆయన తాడ్రిపత్రి మునిపాలిటీ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక నిన్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ కావడంతో టీడీపీ షాక్ లో మునిగిపోయింది. వరుసగా కీలక నేతలు అరెస్ట్ అవుతుండటంతో ఆ పార్టీకి కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.