MLA Koneti Adimulam Video Case: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల కేసులో మరో ట్విస్ట్, పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోర్టులో క్యాష్ పిటిషన్
వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆదిమూలం. తాజాగా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు.
Satyavedu, Sep 12: సత్యవేడు టీడీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆదిమూలం. తాజాగా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. కోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఎమ్మెల్యే ఆదిమూలం చెన్నై నుంచి పుత్తూరులో తన నివాసానికి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఆయన కుటుంబ సభ్యుల్ని తప్ప ఎవరిని లోపలికి అనుమతించటం లేదు. మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక తిరుపతి మెటర్నరీ హాస్పిటల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఇంకా రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు. వైద్య పరీక్ష జరిగిన నేపధ్యంలో వచ్చే రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యేను తిరుపతి ఈస్ట్ పోలీసులు విచారించే అవకాశం ఉంది.
బాధితురాలి ఆరోపణల మేరకు తిరుపతి భీమా ప్యారడైజ్‌లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూములు సీజ్, సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని అశ్లీల వీడియోను ఫారెన్సీక్ ల్యాబ్‌కు పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో శాసనసభ స్పీకర్ అనుమతి తీసుకొని ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం అత్యాచారం కేసుకు సంబంధించి తిరుపతి ఇంటెలిజెన్స్ డీఎస్పీ నేతృత్వంలో విచారణ జరుగుతోంది.
తాజాగా పోలీసులు నమోదు చేసిన కేసుపై ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్ ప్రస్తావించారు. ఆదిమూలం పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆదిమూలం తరపున అడ్వకేట్ శేషకుమారీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రభుత్వం తరపున న్యాయవాది ఏ వరలక్ష్మి వాదించనున్నారు.