Venkata Ramana Reddy Key Comments: సీఎం జగన్ పై దాడి ఘటన అంతా డ్రామా! బాగా నటించారంటూ ఎద్దేవా చేసిన టీడీపీ నేత ఆనం, ఒకేరాయి మూడు గాయాలు ఎలా చేసిందంటూ అనుమానం
పక్కనే ఉన్న రెండంతస్తుల భవనం నుంచి వచ్చిన ఆ రాయి వచ్చి ముఖ్యమంత్రి జగన్ కంటికి గాయం చేసి.. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి గాయం చేసి, ఆ తర్వాత సీఎం జగన్ (CM Jagan) కాలుపై పడి గాయం అయిందట ? మరి ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
Vijayawada, April1 14: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో శనివారం రాత్రి రాయితో (Jagan Stone Hits Incident) దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జగన్ ఎడమకంటి పై భాగంలో గాయమైంది. అయితే, ఈ దాడి ఘటనపై తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఒకే రాయి మూడు గాయాలు ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు. పక్కనే ఉన్న రెండంతస్తుల భవనం నుంచి వచ్చిన ఆ రాయి వచ్చి ముఖ్యమంత్రి జగన్ కంటికి గాయం చేసి.. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి గాయం చేసి, ఆ తర్వాత సీఎం జగన్ (CM Jagan) కాలుపై పడి గాయం అయిందట ? మరి ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ కాలికి బ్యాండేజి కట్టి ఫొటోను ఆనం బయటపెట్టారు. నిన్న ఘటనలో జగన్ అద్భుతంగా నటించారంటూ ఎద్దేవా చేశారు. శనివారం రాత్రి 8.15 గంటలకే వలంటీర్లకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్లింది? వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి.. జగన్‌పై హత్యాయత్నం జరిగింది.. టీవీలు చూడాలని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటూ నిలదీశారు. 8.10 గంటలకు ఘటన జరిగితే.. 8.13 గంటలకే సోషల్ మీడియా స్క్రోలింగ్ మొదలైంది ఆనం వివరించారు.
దాడి ఘటన అంతా డ్రామా అని.. రాత్రి 7 గంటలకు కరెంటు పోయిందని.. గాల్లో ఉన్న డ్రోన్లన్నీ కిందికి దిగాయన్నారు. పక్కా స్కెచ్‌తోనే దాడి జరిగిందని.. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆనం ఆరోపించారు. వైఎస్ భారతీరెడ్డి డైరెక్షన్‌లోనే దాడి డ్రామా జరిగిందని..సీఎం ర్యాలీలో కరెంట్ ఉండదా? డ్రోన్ విజువల్స్ ఎందుకు లేవు? అంటూ ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం జగన్‌కు పట్టుకుందని.. అందుకు వైఎస్సార్‌సీపీ డ్రామాకు తెరలేపిందంటూ ఆయన ఆరోపించారు.