AP Assembly Session 2022: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్, 16 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి ఒకరోజు సస్పెండ్ చేసిన స్పీకర్
స్పీకర్ తమ్మినేని సీతారామ్ టీడీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు.స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సీట్లలో కూర్చోవాలని స్పీకర్ ఆదేశించినా ఆందోళన కొనసాగించారు.
Amaravati, Sep 15: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ టీడీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు.స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సీట్లలో కూర్చోవాలని స్పీకర్ ఆదేశించినా ఆందోళన కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను టీడీపీ సభ్యులు ఏకవచనంతో సంబోధించగా.. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీడీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.దీంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ టీడీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు
పయ్యావుల కేశవ్ కుమారుడు భూమలు కొన్నది వాస్తవం కాదా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఎప్పుడెప్పుడు భూములు కొన్నారో తమ దగ్గర వివరాలు ఉన్నాయన్నారు. రాజధానిపై ఇష్టానుసారం మాట మార్చింది టీడీపీనే అని విమర్శించారు.
కొందరి చేతుల్లోనే అమరావతి భూములు ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతిలోనివి తాత్కాలిక నిర్మాణాలు అని తెలిపారు. 30 వేల ఎకరాల భూమిలో కొంతమంది చేతుల్లోనే 10 వేల ఎకరాలు ఉన్నాయని అన్నారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్‌మెంట్ పార్టీ అని, అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
16 వేల గ్రామాల్లో సచివాలయాలు పెట్టిన వ్యక్తి సీఎం జగన్. గ్రామ సచివాలయాలతో లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా.. 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన.మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రకరణ జరగాలని సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ. సీఎం జగన్‌పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వాళ్లకు రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశం లేదు. 40 ఆలయాలు కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. తన స్వార్థం కోసం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.