Visakha MLC By Elections: సీఎం చంద్రబాబు వెనకడుగు, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటికి దూరం, వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమే!

బలం లేని చోట పోటీ చేసి పరువు పొగొట్టుకోవడం కంటే పోటీ చేయకపోవడమే ఉత్తమమని భావించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నంతో నామినేషన్ గడువు ముగస్తుండగా పోటీ చేయట్లేదని ప్రకటించారు చంద్రబాబు. ఇందుకు సంబంధించి విశాఖ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బలం లేకుండా పోటీ చేయడం సరికాదని కేడర్‌కు తేల్చి చెప్పారు చంద్రబాబు.

TDP not contesting in Vizag MLC polls, YCP Botsa sathyanarayana to elects unanimously!(X)

Vishakapatnam, Aug 13: అంతా ఉహించిందే జరిగింది. బలం లేని చోట పోటీ చేసి పరువు పొగొట్టుకోవడం కంటే పోటీ చేయకపోవడమే ఉత్తమమని భావించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నంతో నామినేషన్ గడువు ముగస్తుండగా పోటీ చేయట్లేదని ప్రకటించారు చంద్రబాబు. ఇందుకు సంబంధించి విశాఖ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బలం లేకుండా పోటీ చేయడం సరికాదని కేడర్‌కు తేల్చి చెప్పారు చంద్రబాబు.

ఇక వైసీపీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయగా మరో స్వతంత్ర అభ్యర్థి సైతం పోటీలో ఉన్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో స్వతంత్ర అభ్యర్థి సైతం పోటీ నుండి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో 838 ఓటర్లు ఉండగా వైసీపీ బలం 598, టీడీపీకి 240 ఓటర్లు ఉన్నారు. మేజిక్ ఫిగర్ 425. దీంతో పోటీ నుండి టీడీపీ తప్పుకోవడమే సరైందని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది.

టీడీపీ తప్పుకోవడంతో బొత్స ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయినట్లే. అయితే వాస్తవానికి విశాఖ టీడీపీ నేతలు మాత్రం పోటీ చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్పీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పోటీ చేస్తారని ప్రచారం కూడా చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఉదయం 5 గంటల నుంచి తనిఖీలు.. అగ్రి గోల్డ్ భూములకు సంబంధించే ఈ దాడులు

గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నుండి టీడీపీ తరపున పోటీ చేయాలని భావించారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి కేటాయించడంతో ఆయనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు మాత్రం పోటీ నుండి తప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి ఇది తొలి గెలుపు అనే చెప్పుకోవాలి.



సంబంధిత వార్తలు

JC Prabhakar Reddy On BJP Leaders: థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా..మీ కంటే జగనే మంచోడు, ఏపీ బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు, చేతగాని కొడుకుల్లాగా బస్సులు తగలబెట్టారని ఫైర్

JC Prabhakar Reddy: వీడియో ఇదిగో, మీకన్నా జగనే మేలు కదరా, బస్సు దగ్ధంపై బీజేపీ నేతలపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి

CM Revanth Reddy: ప్రజలకు అందుబాటులో ఉండండి..పాత, కొత్త నాయకులు అంతా కలిసి పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ త్వరలో వెల్లడిస్తానన్న ముఖ్యమంత్రి

Andhra Pradesh: ముందస్తు బెయిల్ కోరుతూ పేర్ని నాని హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌, విచారించేందుకు అంగీకరించిన ఏపీ హైకోర్టు